వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారత్ లో కోటి దాటిన కరోనా కేసులు .. అయినా 95% పైగానే రికవరీలు

|
Google Oneindia TeluguNews

భారతదేశంలో కరోనావైరస్ (కోవిడ్ -19) బారిన పడినట్లు నిర్ధారించిన వారి సంఖ్య కోటి దాటింది. కొత్తగా 26780 కొత్త కేసులు నమోదైనట్లు గా ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాలను బట్టి తెలుస్తోంది .ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా కరోనా కేసులు రికవరీ రేటు 95.40 శాతం ఉన్నట్లుగా తెలుస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య 3,13,831 కాగా యాక్టివ్ కేసుల శాతం 3.14 గా ఉంది. గత 12 రోజులుగా యాక్టివ్ కేసుల సంఖ్య 4 లక్షల లోపు ఉండటం గమనార్హం.

కోటి కేసులకు చేరువగా ఇండియా: గత 24 గంటల్లో 22,890..తగ్గుతున్న కొత్త కేసులతోనే రిలీఫ్కోటి కేసులకు చేరువగా ఇండియా: గత 24 గంటల్లో 22,890..తగ్గుతున్న కొత్త కేసులతోనే రిలీఫ్

 వరల్డ్ మీటర్స్ ప్రకారం ఇప్పటివరకు 1,00,04,825 కేసులు

వరల్డ్ మీటర్స్ ప్రకారం ఇప్పటివరకు 1,00,04,825 కేసులు

దేశంలో మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైన 10 నెలల తరువాత ధృవీకరించబడిన కేసులు దాదాపు అన్ని రాష్ట్రాల నుండి నివేదించబడ్డాయి. కొన్ని రాష్ట్రాలలో కేసుల సంఖ్య గణనీయంగా తగ్గగా, మరికొన్ని రాష్ట్రాలలో ముఖ్యంగా 47 జిల్లాల నుండి 50 శాతం కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. వరల్డ్ మీటర్స్ ప్రకారం ఇప్పటివరకు భారత దేశం లో కరోనా కేసుల సంఖ్య 1,00,04,825 కాగా కరోనా కారణంగా ఇప్పటివరకు సంభవించిన మరణాలు 1,45, 171 గా ఉంది . కరోనా నుండి కోలుకున్న వారు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 95, 49,923 .

 47 జిల్లాల నుండి 50% కేసులు .. స్టడీ లో వెల్లడి 47 జిల్లాల నుండి 50% కేసులు

47 జిల్లాల నుండి 50% కేసులు .. స్టడీ లో వెల్లడి 47 జిల్లాల నుండి 50% కేసులు

ఇప్పటివరకు కరోనా కారణంగా ధృవీకరించబడిన కోవిడ్ -19 కేసులలో కనీసం సగం . భారతదేశంలోని ఏడు వందలకు పైగా ఉన్న జిల్లాలలో 47 జిల్లాల నుండి మాత్రమే నమోదయ్యాయని ఒక అధ్యయనం తేల్చింది. ఈ 47 జిల్లాలు 16 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలలో విస్తరించి ఉన్నాయి. ఇప్పటి వరకూ చూస్తే అధ్యయనం ప్రకారం ఢిల్లీలోని ఎక్కువగా కేసుల సంఖ్య ఉంది. ఢిల్లీ లో దేశంలోని మొత్తం కేసులో 6.3 శాతం కేసులు నమోదు కాగా , ఆ తర్వాతి స్థానంలో బెంగళూరు, పూణే, ముంబై, థానే మరియు చెన్నై ఉన్నాయి. ఈ ఆరు మెట్రో నగరాలు కలిసి రెండు మిలియన్లకు పైగా కరోనా కేసులను నివేదించాయి. ఇది దేశంలో మొత్తం 22%.

24 మెట్రో నగరాలు , పట్టణాల నుండి కనీసం 50% మరణాలు

24 మెట్రో నగరాలు , పట్టణాల నుండి కనీసం 50% మరణాలు

కోవిడ్ -19 సంబంధిత మరణాలు మరింత ఎక్కువగా ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. 24 మెట్రో నగరాల నుండి కనీసం 50% మరణాలు సంభవించాయి.కరోనావైరస్ మహమ్మారి మొదట భారతదేశంలోని ఢిల్లీ, ముంబై, చెన్నై వంటి మెట్రో నగరాల నుండి భారతదేశంలో వ్యాపించడం ప్రారంభించింది. దేశం పూర్తిగా లాక్డౌన్ నుండి తెరవడంతో మరియు ప్రజలు ప్రయాణించడం ప్రారంభించడంతో ఇది తరువాత ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. దీంతో గ్రామీణ ప్రాంతాల్లో కూడా కేసులు పెరిగాయి. మే మరియు జూన్లలో, మొత్తం కొత్త కేసులలో 45% కేసులు 16 నగరాల నుండి నివేదించబడ్డాయి.

 పట్టాణాల నుండి గ్రామాలకు , గ్రామాల నుండి పట్టణాలకు కరోనా రొటేషన్

పట్టాణాల నుండి గ్రామాలకు , గ్రామాల నుండి పట్టణాలకు కరోనా రొటేషన్

మొత్తం గ్రామీణ ప్రాంతాలలో ఈ రెండు నెలల్లో 12% కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి.
ఆగస్టులో, మొత్తం మెట్రో నగరాల నుండి కేవలం 13% కొత్త కేసులు మాత్రమే వచ్చాయి, మొత్తం గ్రామీణ జిల్లాల నుండి 20% కంటే ఎక్కువ కేసులు నమోదయినట్లు అధ్యయనం వెల్లడించింది. ఏదేమైనా, మళ్ళీ ఇప్పుడు నగరాల్లో కేసుల సంఖ్య మళ్లీ పెరగడంతో ధోరణి రివర్స్ అయినట్టుగా కనిపిస్తుంది. నవంబరులో, దాదాపు 25% కొత్త కేసులు పూర్తిగా నగరాల నుండి వచ్చాయి. ఉదాహరణకు, ఢిల్లీ ఇటీవలే థర్డ్ వేవ్ కరోనా కేసులు నమోదు చేస్తున్నట్లుగా ఢిల్లీ ప్రభుత్వం పేర్కొంది.

English summary
The number of people confirmed to have been infected by the coronavirus disease (Covid-19) in India crossed the 10 million mark on Friday, about 10 months after the pandemic started spreading in the country. The confirmed cases have been reported from almost all states, but are largely concentrated in a select few districts.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X