నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మోదీ కల సాకారం - అంతరిక్షంపై ప్రైవేట్ సంస్థల ఆధిపత్యం: ఇస్రో నుంచే మొదలు

|
Google Oneindia TeluguNews

నెల్లూరు: దేశీయ అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో ఇవ్వాళ సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష పరిశోధన సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేసిన రాకెట్‌ను విజయవంతంగా అంతరిక్షంలోకి ప్రయోగించింది. శ్రీహరికోటలోని సతీష్ ధవన్ అంతరిక్ష పరిశోధన కేంద్రం నుంచి నింగిలోకి దూసుకెళ్లిందా రాకెట్. దీనితో అంతరిక్షంపైనా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు తమ ఆధిపత్యాన్ని చెలాయించడం ఆరంభమైనట్టే.

కక్ష్యలోకి..

కక్ష్యలోకి..

ఈ ఉదయం 11:30 గంటలకు షార్ కేంద్రం నుంచి ఈ విక్రమ్‌- సబార్బిటల్ రాకెట్‌ నింగిలోకి దూసుకెళ్లనుంది. దేశీయ అంతరిక్ష పరిశోధనలకు పితామహుడిగా భావించే డాక్టర్ విక్రమ్‌ సారాభాయ్‌ జ్ఞాపకార్థం ఈ రాకెట్‌కు 'విక్రమ్‌-ఎస్‌' అని పేరుపెట్టారు. ఇదే తొలి ప్రైవేట్ రాకెట్ కావడం వల్ల ప్రారంభ్‌ మిషన్‌గా నామకరణం చేశారు. ఆరు మీటర్ల పొడవు, బరువు 545 కిలోల బరువు ఉన్న ఈ రాకెట్ తన వెంట మూడు పేలోడ్లను మోసుకెళ్లింది. వాటిని కక్ష్యలోకి ప్రవేశపెట్టనుంది.

 83 కిలోల పేలోడ్స్..

83 కిలోల పేలోడ్స్..


అవన్నీ ఉపగ్రహాలే. వాటి బరువు 83 కిలోలు. ఇందులో ఒకటి స్వదేశీ ఉపగ్రహం కాగా.. మిగిలిన రెండూ విదేశాలకు చెందినవి. ఈ స్వదేశీ ఉపగ్రహాన్ని చెన్నైకి చెందిన ఏరోస్పేస్‌ స్టార్టప్‌ కంపెనీ స్పేస్‌ కిడ్స్‌ రూపొందించింది. దీని పేరు ఫన్‌-శాట్‌. రెండున్నర కిలోల బరువు ఉన్న చిన్న శాటిలైట్ ఇది. ఇది ప్రారంభం మాత్రమే. దీని తరువాత కూడా అనేక ప్రైవేటు ప్రాజెక్టులను చేపట్టనుంది ఇస్రో. అంతరిక్ష రంగంలో పరిశోధనలకు సంబంధించిన రంగంలో కార్యకలాపాలను సాగిస్తోన్న పలు స్టార్టప్‌ కంపెనీలతో ఒప్పందాలను కుదుర్చుకుంది.

కేంద్రం హర్షం..

కేంద్రం హర్షం..

కాగా- ఈ తొలి ప్రైవేట్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ హర్షం వ్యక్తం చేశారు. అంతరిక్ష ప్రయోగాల్లో సరికొత్త అధ్యాయం మొదలైందని వ్యాఖ్యానించారు. అంతరిక్ష పరిశోధనల్లో ప్రైవేట్, స్టార్టప్ కంపెనీలను భాగస్వామ్యం చేయాలన్న తమ ప్రభుత్వ లక్ష్యాన్ని ఇస్రో నెరవేర్చిందని ప్రశంసించారు. ఈ రంగంలో మరిన్ని ప్రైవేట్ సంస్థలు రావాల్సిన అవసరం ఉందని అన్నారు.

150 స్టార్టప్స్ దరఖాస్తులు..

ఈ ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ (ఇన్‌-స్పేస్) ఛైర్మన్ డాక్టర్ పవన్ కే గోయెంకా స్పందించారు. ఇప్పటికే 150 ప్రైవేట్ కంపెనీలు తమ ఉపగ్రహ వాహక నౌకలు, ఉపగ్రహాలు, పేలోడ్స్, గ్రౌండ్ స్టేషన్లను ఏర్పాటు చేసుకోవడానికి దరఖాస్తు చేసుకున్నాయని వివరించారు. వాటన్నింటికీ ఈ తాజా ప్రయోగం ఓ మైలురాయిగా మారుతుందని వ్యాఖ్యానించారు.

English summary
India's first ever private rocket Vikram-S launched from Sriharikota in Andhra Pradesh. The rocket has been built by Skyroot Aerospace.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X