బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Mission Mars: మంగళ్‌యాన్ కథ సమాప్తం - గ్రహణ కాల ప్రభావం..!!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ.. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో ఒకటి మిషన్ మార్స్. ఇందులో భాగంగా అంగారకగ్రహం మీదికి ప్రయోగించిన మంగళ్‌యాన్ కథ ముగిసింది. ఈ విషయాన్ని ఇస్రో ధృవీకరించింది. మంగళ్‌యాన్‌తో సంబంధాలను పునరుద్ధరించుకోలేమని, దాన్ని తిరిగి రికవరీ చేయలేమని వెల్లడించింది. ఇంధనం అడుగంటడం వల్ల దాన్ని మళ్లీ పునరుద్ధరించడం కష్టమని స్పష్టం చేసింది. అంగారక గ్రహం కక్ష్యలో దాన్ని మళ్లీ ప్రవేశపెట్టడానికి చాలినంత ఇంధనం లేదంటూ వివరణ ఇచ్చింది ఇస్రో.

 ఎనిమిదేళ్ల పాటు..

ఎనిమిదేళ్ల పాటు..

మార్స్ ఆర్బిటర్ మిషన్ పేరుతో ఇస్రో ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. 2013 నవంబర్‌లో దీన్ని అంగారక గ్రహం మీదికి ప్రయోగించింది. ఎనిమిది నెలల పాటు అంతరిక్షంలో ప్రయాణించిన మంగళ్‌యాన్ ఆర్బిటర్.. 2014 సెప్టెంబర్‌లో ఆ గ్రహకక్ష్యలోకి ప్రవేశించింది. అప్పటి నుంచి ఏకధాటిగా అంగారక గ్రహానికి సంబంధించిన సమాచారాన్ని ఇస్రోకు అందజేస్తూ వచ్చింది. ఎనిమిది సంవత్సరాలుగా సేవలందించింది.

బ్యాటరీ ఆపరేటింగ్..

బ్యాటరీ ఆపరేటింగ్..


ఇటీవలే ఇస్రో గ్రౌండ్ స్టేషన్‌తో సంబంధాలను కోల్పోయింది. ఈ స్పేస్‌క్రాఫ్ట్‌తో కమ్యూనికేషన్ తెగిపోయాయి. ఆర్బిటర్‌లో ప్రొపెల్లెంట్ అయిపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడినట్లు కథనాలు వెలువడ్డాయి. మంగళ్‌యాన్ ఆర్బిటర్‌లో అమర్చిన బ్యాటరీ ఆపరేటింగ్ కాలపరిమితిని ముగిసిపోవడం వల్ల కమ్యూనికేషన్ తెగి ఉంటుందనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. దీన్ని ఇస్రో అధికారికంగా ధృవీకరించింది.

గ్రహణాల వల్ల బ్లాక్ అవుట్..

గ్రహణాల వల్ల బ్లాక్ అవుట్..

మామ్‌లో అమర్చిన బ్యాటరీ ఖాళీ కావడం వల్ల లింక్ అందట్లేదని వెల్లడించింది. దీన్ని మళ్లీ రికవరీ చేయలేమనీ తేల్చి చెప్పింది ఇస్రో. అంగారక గ్రహం కక్ష్యలో 800 వాట్లను రీఛార్జ్ చేసుకునే సామర్థ్యం ఈ లిథియం-అయాన్ బ్యాటరీకి ఉంది. గ్రహణ సమయాల్లో ఏర్పడే బ్లాక్ అవుట్ పరిస్థితులు బ్యాటరీని క్షీణింపజేసినట్లు ఇస్రో విశ్లేషిస్తోంది. సౌరఇంధనం అందకపోవడం వల్ల ఈ బ్లాక్ అవుట్ సమయంలో బ్యాటరీ తనను తాను రీఛార్జ్ చేసుకునే సామర్థ్యాన్ని కోల్పోతుంది.

థ్రస్టర్లను మండించలేక..

థ్రస్టర్లను మండించలేక..


ఈ ఏడాది ఏప్రిల్‌లో సుదీర్ఘ గ్రహణ కాలాన్ని ఎదుర్కొంది మంగళ్‌యాన్ ఆర్బిటర్. దాని ప్రభావం వల్ల ఇంధనాన్ని ఖాళీ అయి ఉంటుందని భావిస్తోంది. మెయిన్ థ్రస్టర్‌ను రీఛార్జ్ చేయడానికి 1,880 పౌండ్ల మేర ఇంధనాన్ని తీసుకెళ్లింది. ఈ థ్రస్టర్‌ను కంట్రోల్ చేయడానికి ఎనిమిది చిన్న థ్రస్టర్లను మోసుకెళ్లింది. ఆర్బిటర్ ఆటోమేటెడ్ సిస్టమ్ మొత్తం దీని మీదే ఆధారపడి పని చేస్తుంటుంది. గ్రహణం వల్ల ఏర్పడిన బ్లాక్ అవుట్ పరిస్థితుల వల్ల ఆ వ్యవస్థ దెబ్బతిన్నట్లు ఇస్రో ప్రాథమికంగా నిర్ధారించింది.

English summary
Over a decade after launched, India’s maiden mars mission is over as Mangalyaan is non-recoverable, confirmed ISRO.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X