ఇండియాలో ఉన్న ఒకే ఒక్క అగ్నిపర్వతం బద్దలైంది..

ప్రస్తుతం ఈ అగ్నిపర్వతం నుంచి భారీ ఎత్తున లావా ఎగజిమ్మడంతో పాటు దట్టమైన పొగలు వెలువడుతున్నట్లుగా ఎన్ఐఓ పేర్కొంది.

పనాజీ: భారత్‌లో ఉన్న ఏకైక అగ్నిపర్వతం బద్దలైంది. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న బారెన్ ఐలాండ్ వాల్కెనో విస్పోటనం చెందటంతో అందులోంచి లావా ఎగజిమ్ముతోంది.

1991లో చివరిసారిగా ఈ అగ్నిపర్వతం బద్దలవగా.. ఆ తర్వాత ఇన్నేళ్లకు మళ్లీ విస్పోటనం చెందినట్లుగా గోవాలోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ(ఎన్ఐఓ) తెలిపింది.

India's Only Live Volcano Active Again After 150 Years, Say National Experts

ప్రస్తుతం ఈ అగ్నిపర్వతం నుంచి భారీ ఎత్తున లావా ఎగజిమ్మడంతో పాటు దట్టమైన పొగలు వెలువడుతున్నట్లుగా ఎన్ఐఓ పేర్కొంది. గత నెల 23న బారెన్ అగ్నిపర్వతాన్ని పరిశీలించడానికి కొంతమంది శాస్త్రవేత్తల బృందం వెళ్లగా.. ఆ సమయంలో దాని నుంచి పొగలు వెలువడటం వారు గమనించారు.

పగటిపూట కేవలం పొగలు మాత్రమే వెలువడుతున్నట్లుగా గుర్తించిన శాస్త్రవేత్తలు, రాత్రి సమయంలో దాని నుంచి లావా బయటకొస్తున్నట్లుగా చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+