వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

‘ఉగ్ర అంతానికి పాక్‌తో చర్చలు: కాంగ్రెస్‌తో నాశనమే’

|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: ఉగ్రవాదం అంతానికి, చరిత్ర గతిని మార్చేందుకే పాకిస్థాన్‌తో చర్చల ప్రక్రియను పునఃప్రారంభించినట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పష్టంచేశారు. ఉగ్రవాదంపై చూపే చిత్తశుద్ధిని బట్టి పొరుగుదేశాన్ని అంచనా వేయడం జరుగుతుందనీ, భారత్‌ తన భద్రతపై రాజీ పడబోదని స్పష్టం చేశారు. కేరళలోని కొచ్చి వద్ద సముద్రంలో ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య నౌకపై సైనిక కమాండర్ల సదస్సులో ఆయన మాట్లాడారు.

పాక్‌తో శాంతియుత సంబంధాల నిర్మాణం, సహకారం, సుస్థిరతను ప్రోత్సహించేందుకే పాక్‌తో సంబంధాలపై ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. ఈ దిశగా ఎన్నో అడ్డంకులు, సవాళ్లు ఉన్నా, శాంతి అందించే ఫలాలు భారీగా ఉంటాయన్నారు.

ఇటీవలి కాలంలో ఇరుదేశాల సంబంధాలపై ప్రధాని మోడీ మాట్లాడటం ఇదే తొలిసారి. మన భవిష్యత్తుకు, ప్రపంచంలో మన ప్రాంతానికి పొరుగే కీలకమనీ, మన పొరుగు మాత్రం పూర్తిస్థాయి భద్రతా సవాళ్లతో నిండి ఉందన్నారు.

దేశ నాశనమే కాంగ్రెస్ పని: మోడీ నిప్పులు

పార్లమెంటును స్తంభింపజేయడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. దేశాన్ని నాశనం చేయడమే ఆ పార్టీ ఏకైక కార్యక్రమం అని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని ఇప్పటికీ కాంగ్రెస్ దిగమింగుకోలేక పోతోందని అన్నారు. అందుకే పార్లమెంట్‌ను అడుగడుగునా అడ్డుకోవడం ద్వారా దేశాభివృద్ధికి అవరోధాలు, ఆటంకాలు కల్పిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్లమెంట్ సవ్యంగా, సజావుగా పనిచేయాలంటే చర్చించడం, విభేదించడం, నిర్ణయించడమే పరమావధి కావలన్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ హితబోధనలను కాంగ్రెస్ ఎంత మాత్రం ఖాతరు చేయడం లేదని అన్నారు. వీటి స్థానే పార్లమెంట్‌లో చర్చకు ఎలాంటి అవకాశం లేకుండా చేస్తోందన్నారు.

అవరోధాలు, ఆటంకాలే కాంగ్రెస్ అజెండాగా మారాయని, కానీ తమ ప్రభుత్వం మాత్రం అభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతుందని ప్రధాని మోడీ అన్నారు. రాష్ట్ర మాజీ ప్రధాని ఆర్.శంకర్ విగ్రహాన్ని ఈ సందర్భంగా ఆవిష్కరించిన మోడీ ‘ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది'అని తెలిపారు.

‘ఉగ్ర అంతానికి పాక్‌తో చర్చలు: కాంగ్రెస్‌తో నాశనమే’

‘ఉగ్ర అంతానికి పాక్‌తో చర్చలు: కాంగ్రెస్‌తో నాశనమే’

ఆర్థిక భాగస్వామ్యం దిశగా చైనాతో సన్నిహిత సంబంధాలనే కోరుకుంటున్నట్లు స్పష్టంచేశారు. ఎలాంటి దుస్సాహసాన్నైనా ఎదుర్కొనే, ఓడించేందుకు మన రక్షణ బలగాలు సిద్ధంగా ఉన్నట్లు భారత్‌ ఆత్మవిశ్వాసంతో ఉందన్నారు.

‘ఉగ్ర అంతానికి పాక్‌తో చర్చలు: కాంగ్రెస్‌తో నాశనమే’

‘ఉగ్ర అంతానికి పాక్‌తో చర్చలు: కాంగ్రెస్‌తో నాశనమే’

వేగవంతంగా యుద్ధాల్ని గెలిచే సామర్థ్యం దేశానికి అవసరమని పేర్కొన్నారు. సాయుధ బలగాలు డిజిటల్‌ నెట్‌వర్క్‌లు, అంతరిక్ష సాధన సంపత్తిని శక్తి సామర్థ్యాలుగా మరల్చుకోవాలని సూచించారు.

‘ఉగ్ర అంతానికి పాక్‌తో చర్చలు: కాంగ్రెస్‌తో నాశనమే’

‘ఉగ్ర అంతానికి పాక్‌తో చర్చలు: కాంగ్రెస్‌తో నాశనమే’

ఆఫ్రికాతో మన సంబంధాల్ని మరో స్థాయికి తీసుకెళ్లామనీ, మధ్య ఆసియాతో ప్రాచీన సంబంధాల్ని తిరిగి సాధిస్తున్నామన్నారు. పశ్చిమ ఆసియా, గల్ఫ్‌తో సంబంధాల్ని, భద్రతా సహకారాన్ని నెలకొల్పామన్నారు.

‘ఉగ్ర అంతానికి పాక్‌తో చర్చలు: కాంగ్రెస్‌తో నాశనమే’

‘ఉగ్ర అంతానికి పాక్‌తో చర్చలు: కాంగ్రెస్‌తో నాశనమే’

ఇరాన్‌తోనూ సన్నిహిత సంబంధాల్ని పునరుద్ధరించామని తెలిపారు. భద్రత బలగాల బాధ్యతలు మరెంతోకాలం సరిహద్దులకే పరిమితం కాబోవని వివరించారు. ప్రభుత్వం భారత్‌లో రక్షణ ఉత్పత్తిని మార్చివేస్తోందన్నారు.

‘ఉగ్ర అంతానికి పాక్‌తో చర్చలు: కాంగ్రెస్‌తో నాశనమే’

‘ఉగ్ర అంతానికి పాక్‌తో చర్చలు: కాంగ్రెస్‌తో నాశనమే’

కాగా, త్రివిధ దళాల వార్షిక కార్యక్రమమైన ఏకీకృత కమాండర్ల సదస్సుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వం వహించారు. సదస్సును తొలిసారిగా ఢిల్లీ వెలుపల.. కోచి తీరానికి 50 కి.మీ. దూరంలో ఐఎన్‌ఎస్‌ విక్రమాదిత్య నౌకలో నిర్వహించారు.

‘ఉగ్ర అంతానికి పాక్‌తో చర్చలు: కాంగ్రెస్‌తో నాశనమే’

‘ఉగ్ర అంతానికి పాక్‌తో చర్చలు: కాంగ్రెస్‌తో నాశనమే’

రక్షణ మంత్రి మనోహర్‌ పారికర్‌, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌దోవల్‌, త్రివిధ దళాధిపతులు, ఇతర సీనియర్‌ అధికారులు హాజరయ్యారు. అంతకుముందు ప్రధాని దక్షిణ నావికా కమాండ్‌లో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.

English summary
Prime Minister Narendra Modi on Tuesday said India was in a "difficult neighbourhood", but the country's responsibility on the security scene was no longer limited to its borders and coastline.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X