వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గత పదేళ్లలో భారత్‌లో 3 ఉరిశిక్షలు: ఎవరెవరు?

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత్‌లో 2004 నుంచి 2013 మధ్య కాలంలో 1303 మరణశిక్షలు విధించినట్లు నేషనల్ క్రైం రికార్డు బ్యూరో లెక్కల చెబుతున్నాయి. అయితే ఇందులో కేవలం ముగ్గురికి మాత్రమే మరణశిక్ష అమలైనట్లు లెక్కలున్నాయి.

గత పదేళ్లలో విధించిన మూడు ఉరిశిక్షలు కూడా పశ్చిమ బెంగాల్ (2004), మహారాష్ట్ర (2012), న్యూఢిల్లీ(2013)లో చోటు చేసుకున్నాయి. 2004 నుంచి 2012 వరకు భారత్‌లో ఎలాంటి ఉరిశిక్షలు అమలు కాకపోవడం విశేషం.

ఆగస్టు 14, 2004: పశ్చిమ బెంగాల్‌లో ఓ బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన ఉదంతంలో ధ్యాన్ చంద్ చటర్జీని ఆగస్టు 14 అలీపూర్ కేంద్ర కారాగారంలో ఉరితీశారు. యాదృచ్ఛికంగా ఆ రోజు అతని 42 వ పుట్టినరోజు కావడం విశేషం.

India saw 1,303 death sentences, 3 executions in last 10 years

నవంబర్ 21, 2012: 2008 ముంబై ఉగ్రదాడి సూత్రధారి, కరడుగట్టిన ఉగ్రవాది అజ్మల్ అమీర్ కసబ్‌ను మహారాష్ట్రలోని పుణేలో ఉన్న ఎర్రవాడ జైలులో ఉరి తీశారు.

ఫిబ్రవరి 9, 2013: 2001 పార్లమెంటు దాడి కేసులో ఉగ్రవాది మహమ్మద్ అఫ్జల్ గురుకు సుప్రీం కోర్టు విధించిన మరణశిక్ష న్యూఢిల్లీలో అమలు చేశారు.

జులై 30, 2015: 1993 ముంబై వరుస పేలుళ్ల సంఘటనకు సంబంధించి రేపు (జూలై 30)న యాకూబ్ మెమన్ ఉరిశిక్ష అమలైతే, పుట్టినరోజు నాడు ఉరిశిక్ష అమలైన దోషులలో మెమన్ రెండోవాడు అవుతాడు. రేపు యాకుబ్ మెమన్ 53వ పుట్టినరోజు.

1993లో ముంబైలో నిమిషాల వ్యవధిలో 13 పేలుళ్లు జరిగాయి. ఈ వరుస పేలుళ్లలో దాదాపు 257 మంది చనిపోయారు. 7 వందల మంది వరకు గాయపడ్డారు. ఇది ఇలా ఉంటే 3,751 మంది దోషులకు విధించిన ఉరిశిక్షలను యావజ్జీవ శిక్షలుగా మారుస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

ముస్లిం కాబట్టే మెమన్‌ను ఉరితీస్తున్నారన్న ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. 1947 స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 170 (మెమన్‌తో కలిపి) మందికి ఉరిశిక్ష పడితే అందులో కేవలం 15 మంది ముస్లింలకు ఉరిశిక్షలు అమలయ్యాని బీజేపీ నేత సుబ్రహ్మణ్యం స్వామి తెలిపారు.

ఎక్కువ ఉరిశిక్షలు అమలు చేసిన సంవత్సరంగా 2007 ఉంది.

2007లో అమలైన ఉరిశిక్షలు: 186
2005లో అమలైన ఉరిశిక్షలు: 164

ఇక రాష్ట్రాల వారీగా వస్తే గడచిన పదేళ్ల కాలంలో ఉత్తరప్రదేశ్‌లో 318 ఉరిశిక్షలు అమలయ్యాయి. ఆ తర్వాతి స్ధానంలో మహారాష్ట్ర 108, కర్ణాటక 107, బీహార్ 105, మధ్య ప్రదేశ్‌లో 104 విధించారు. 2004 నుంచి 2013 వరకు 2,465 ఖైదీలకు అమలు చేసిన ఉరిశిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా ఢిల్లీ ప్రభుత్వం మార్పు చేసింది.

ఐక్యరాజ్య సమితి నివేదిక ప్రకారం ప్రపంచంలో 160 దేశాలు ఉరిశిక్షను నిషేధించాయి. ఉరిశిక్షపై ఐక్యరాజ్యసమితి ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఇండియా, చైనా, జపాన్, అమెరికా దేసాలు తిరస్కరించాయి.

English summary
A death sentence such as the one handed to Yakub Memon, lone convict of the 1993 Mumbai serial bombings is common in India, with 1,303 such verdicts between 2004 and 2013, according to this National Crime Record Bureau (NCRB) prison statistics report.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X