శ్రీలంకకు భారత్ చమురు సాయం-2.7 లక్షల మెట్రిక్ టన్నులు-పొరుగే ప్రధానమన్న జైశంకర్

ఆర్ధిక సంక్షోభం బారిన పడిన పొరుగుదేశం శ్రీలంకను ఆదుకునేందుకు భారత్ ముందుకొచ్చింది. ఇప్పటికే భారీ ఎత్తున ఆహారధాన్యాల్ని పంపుతున్న భారత్.. తాజాగా భారీగా చమురును కూడా పంపాలని నిర్ణయించింది. శ్రీలంకలో ప్రస్తుతం చమురు ధరలు ఆకాశాన్నంటున్న నేపథ్యంలో భారీగా చమురును పంపడం ద్వారా ఆర్ధిక వ్యవస్ధను గాడిన పెట్టుకునే అవకాశం కల్పించాలని భారత్ నిర్ణయించింది.

భారత్ కు ఇరుగుపొరుగుదేశాలే ముఖ్యమని విదేశాంగశాఖ మంత్రి జైశంకర్ వెల్లడించారు. ఆర్ధిక సంక్షోభం బారిన పడిన శ్రీలంకకు 2.7 లక్షల మెట్రిక్ టన్నుల చమురును పంపాలని నిర్ణయించిట్లు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన చేశారు. గత 24 గంటల్లో 36,000 మెట్రిక్ టన్నుల పెట్రోల్, 40,000 మెట్రిక్ టన్నుల డీజిల్ శ్రీలంకకు డెలివరీ చేసినట్లు ఆయన వెల్లడించారు. భారతదేశ సాయం కింద వివిధ రకాల ఇంధనం మొత్తం 2 లక్షల 70 వేల మెట్రిక్ టన్నులు దాటినట్లు తెలిపారు.

India Says neighborhood first, sent 270000 MT Fuel to Sri lanka

ఆర్ధిక సంక్షోభం బారిన పడకముందు శ్రీలంకలో భారీ పెట్టుబడులు పెట్టినట్లు నటించిన చైనా.. సంక్షోభం రాగానే మౌనంగా ఉండిపోయింది. అయితే గతంలో చైనా అండ చూసుకుని భారత్ కు షాకులిచ్చిన శ్రీలంక ఇప్పుడు భారత్ వైపే చూస్తోంది. దీంతో అనివార్యంగా భారత్ కూడా పొరుగుదేశం శ్రీలంకను ఆదుకునేందుకు ముందుకొస్తోంది. తద్వారా పొరుగుదేశాలతో శత్రుత్వాన్ని తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం భారత్ చేస్తున్న సాయంతో లంకలో పరిస్దితులు కాస్త మెరుగుపడుతున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+