వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

"ప్రమాదం, పాక్ నుంచి వచ్చేయండి"

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పాకిస్థాన్ లో పని చేస్తున్న ఎనిమిది మంది భారత దౌత్యాధికారులను వెంటనే వెనక్కి వచ్చేయాలని భారత విదేశాంగ వ్యవహారాల శాఖ సూచించింది. పాక్ లో పని చేస్తున్న భారత్ కు చెందిన అధికారుల పేర్లు, వారి ఫోటోలను స్థానిక మీడియా ప్రచురించింది.

మీడియాలో వారి పేర్లు, ఫోటోలు ప్రచురితం కావడంతో అక్కడ వారికి ప్రమాదం వాటిల్లే అవకాశం ఉందనే అనుమానంతో అందరిని భారత్ కు రప్పిస్తోంది. పాక్ లో పని చేస్తున్న దౌత్యాధికారులను వెనక్కిపిలిపించాలని భారత్ నిర్ణయం తీసుకుంది.

గూఢచార్యం చేస్తున్నారని అనుమానంతో ఐదుగురు భార దౌత్యాధికారులను ఇస్లామాబాద్ నుంచి తొలగించారని పాక్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఆదేశ మీడియాలో ఇలాంటి వార్తలు రావడంతో భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికారులు అలర్ట్ అయ్యారు.

India says withdrawing 8 Diplomants from Pakistan

ఇదే సమయంలో న్యూఢిల్లీలో దౌత్య పరమైన రక్షణలో ఉన్న ఆరుగురు అధికారులను పాక్ వెనక్కి పిలుపించుకుంది. భారత్ లోని పాకిస్థాన్ హై కమిషన్ లో పని చేస్తున్న ఆరుగురు అధికారులు గూఢచార్యం చేస్తూ పాక్ కు వివిధ రకాలుగా సమాచారం అందిస్తున్నారని వెలుగు చూసింది.

పాక్ హైకమిషన్ లో ఉద్యోగం చేస్తున్న మొహమ్మద్ అక్తర్ ను అరెస్టు చెయ్యడంతో అసలు విషయం బయటపడింది. తరువాత మొహమ్మద్ అక్తర్ ను దేశం నుంచి బహిష్కరించారు. ఇతను రాజస్థాన్ లో ఇద్దరు గూఢచారులను నియమించి భారత రక్షణ శాఖకు చెందిన కీలక సమాచారం సేకరించి రహస్యంగా పాక్ కు పంపిస్తున్నాడని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

రాజస్థాన్ కు చెందిన ఆ ఇద్దరి నుంచి ఢిల్లీ జూలో కీలక పత్రాలు తీసుకుంటున్న సమయంలో ఢిల్లీ పోలీసులు మొహమ్మద్ ను అరెస్టు చేశారు. మొహమ్మద్ అక్తర్ పాక్ హైకమిషన్ లోని వీసా సెక్షన్ లో ఉద్యోగం చేస్తున్నాడు.

మూడు సంవత్సరాల క్రితం మొహమ్మద్ అక్తర్ ను పాకిస్థాన్ ఇంటెల్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్ (ఐఎస్ఐ) భారత్ లో నియమించింది. తరువాత అతనికి ఢిల్లీలోని పాక్ హై కమిషన్ లో ఉద్యోగం ఇచ్చిందని అధికారుల విచారణలో వెలుగు చూసింది.

మొహమ్మద్ అక్తర్ తో పాటు పాక్ హై కమిషన్ లో పని చేస్తున్న 16 మంది ఉద్యోగులు భారత్ లో గూఢచర్య కార్యకలాపాలకు పాల్పడుతూ భారత ఆర్మీ, బీఎస్ఎఫ్ కు చెందిన సమాచారం సేకరించి రహస్యంగా పాక్ కు పంపిస్తున్నారని విచారణలో వెలుగు చూసింది.

ఢిల్లీ పోలీసులు, ఇంటిలిజెన్స్ అధికారుల విచారణలో ఈ వివరాలు బయటకు వచ్చాయి. ఇదే సమయంలో పాక్ లోని భారత హై కమిషన్ లో ఉద్యోగం చేస్తున్న భారత అధికారుల ఫోటోలు, పేర్లను పాక్ మీడియా ప్రచురించింది.

English summary
Mehmood Akhtar, was caught by the police at the Delhi zoo while receiving sensitive intel and documents from two men from Rajasthan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X