కొత్త కరోనా కేసులలో ఇండియా వరల్డ్ రికార్డ్ .. ఒకే రోజులో 80వేలకు పైగా కేసులతో తొలి దేశంగా భారత్

ఒక్క రోజులోఇండియా 8 0వేలకు పైగా కేసులను నమోదు చేసి రికార్డ్ సృష్టించింది .భారతదేశం ఒక రోజులో 80,000 కేసులను దాటటం ప్రపంచ రికార్డ్ . కరోనా మహమ్మారి వ్యాప్తి చెందిన తరువాత ఒకే రోజులో ఈ మార్కును దాటిన ప్రపంచంలో మొదటి దేశంగా ఇండియా ఉంది . తాజాగా ఇండియా 36 లక్షలకు పైగా కేసులతో కరోనా దారుణంగా ప్రభావం చూపిస్తున్న దేశాల్లో ఒకటిగా ఉంది . ఇండియాలో కరోనా కేసులు రోజురోజుకు భారీ సంఖ్యలో నమోదవుతున్న తీరు ప్రస్తుతం ఆందోళన కలిగిస్తుంది.భారతదేశంలో కరోనా కరాళ నృత్యం చేస్తూనే ఉంది . ఆగస్ట్ నెలలో కూడా ఇండియా భారీగానే కేసులను నమోదు చేసింది. చివరి వారంలో చాల పెద్ద సంఖ్యలో కేసులు నమోదు అయ్యాయి.

ఇండియాలో గత 24 గంటల్లో 80,092 కొత్త కేసులు, 971 మరణాలు

ఇండియాలో గత 24 గంటల్లో 80,092 కొత్త కేసులు, 971 మరణాలు

గత 24 గంటల్లో భారత్ లో 80,092 కొత్త కేసులు నమోదయ్యాయి. వరల్డ్ మీటర్స్ ప్రకారం ఇండియాలో ఇప్పటివరకు 3,621,245 కేసులు నమోదు అయ్యాయి .మొత్తం మరణాల సంఖ్య 64,617 గా ఉంది. కరోనా నుండి కోలుకున్న వారి సంఖ్య 2,774,801 గా ఉంది. ఇదే సమయంలో కరోనాకు చికిత్స పొందుతున్న యాక్టివ్ కేసులు 7,81,613గా ఉంది . కొత్త కేసుల వృద్ధి రేటు మధ్యలో కాస్త తగ్గిన తరువాత ఆగస్టు చివరి వారంలో భయంకరంగా పెరిగింది. గత 24 గంటల్లో 971 మరణాలతో, భారతదేశం యొక్క మరణాల సంఖ్య 64,617 వద్ద ఉంది. ఇది త్వరలోనే 65,000 మార్కుకు చేరుకునే అవకాశం ఉంది .

ఆగస్ట్ చివరి వారంలో విపరీతంగా పెరిగిన కరోనా కేసులు

ఆగస్ట్ చివరి వారంలో విపరీతంగా పెరిగిన కరోనా కేసులు


వరుసగా ఐదు రోజులు 76,000 కంటే ఎక్కువ తాజా కేసులు నమోదవటం, ఈ వారం 13.1% వద్ద వృద్ధి రేటు గత వారంలో నమోదైన 4.7% వృద్ధి రేటుకు దాదాపు మూడు రెట్లు పెరిగటం కాస్త ఆందోళనకర అంశం .
కరోనా వృద్ధి రేటు గత వారంలో 5.9% మరియు నెల మొదటి వారంలో (ఆగస్టు 3-9) 10.9% గా ఉంది . అదేవిధంగా, వరుసగా నాలుగు రోజులు 1,000కి పైగా మరణాలు నమోదు కావడంతో, ఈ వారంలో మరణాల పెరుగుదల రేటు 3.9% వద్ద ఉంది. అంతకుముందు వారంలో నమోదైన 1.7% కంటే మరణాల రేటు కూడా రెట్టింపుగా ఉంది .

 మహారాష్ట్రలో ఒక్కరోజే 16,867 కొత్త కేసులు .. తొలిసారి అత్యధిక కొత్త కేసులు ఎక్కడంటే

మహారాష్ట్రలో ఒక్కరోజే 16,867 కొత్త కేసులు .. తొలిసారి అత్యధిక కొత్త కేసులు ఎక్కడంటే


మహారాష్ట్ర అత్యధికంగా 16,867 కొత్త కేసులను నమోదు చేసింది.వరుసగా రెండవ రోజు 16,000 కేసులతో మహారాష్ట్రలో కరోనా పంజా విసురుతుంది . అలాగే ఐదు ఇతర రాష్ట్రాలు , మరియు కేంద్ర పాలిత ప్రాంతాలు తొలిసారి అత్యధిక కరోనా కేసులను నమోదు చేశాయి. ఆ రాష్ట్ర రికార్డులను తిరగరాశాయి. యుపి 6,233 కొత్త కేసులతో మొదటిసారి అత్యధిక కేసులను నమోదు చేసింది. రాజస్థాన్ 1,450 తాజా కేసులు, మధ్యప్రదేశ్ 1,558 తాజా కేసులు , ఛత్తీస్‌గడ్ 1,471 తాజా కేసులు , జమ్మూ & కాశ్మీర్ 786 కొత్త కేసులు నమోదు అయ్యాయి .

Recommended Video

    NSUI Demands Telangana Govt To Postpone Entrance Exams
    ఫస్ట్ ప్లేస్ లో మహారాష్ట్ర .. సెకండ్ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్

    ఫస్ట్ ప్లేస్ లో మహారాష్ట్ర .. సెకండ్ ప్లేస్ లో ఆంధ్రప్రదేశ్

    అత్యధికంగా ప్రభావితమైన రాష్ట్రమైన మహారాష్ట్ర ఆదివారం 296 మరణాలను నమోదు చేసింది.మహారాష్ట్రలో కరోనా మరణాల సంఖ్య 24,399 కు చేరుకుంది. ఇది దేశంలోని మొత్తం మరణాలలో దాదాపు 38%. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో, తమిళనాడు మూడో స్థానంలో కొనసాగుతున్నాయి . ఆంధ్ర ప్రదేశ్లో ఇప్పటి వరకు మొత్తం 4,24,767 కేసులు నమోదు కాగా , 99,129 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కరోనా నుండి కోలుకున్న వారు 3,21,754 కాగా కరోనా మృతుల సంఖ్య 3,884 గా ఉంది. తమిళ నాడులో ఇప్పటివరకు 4,22,085 కరోనా కేసులు నమోదు కాగా , 52,721 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి .3,62,133 మంది డిశ్చార్జ్ అయ్యారు. 7,231 మంది మృతి చెందారు .

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+