చైనా వక్రబుద్ది: జిన్‌జియాంగ్‌లో రోడ్డు, తప్పేంటీ?
న్యూఢిల్లీ: భారత్- చైనా సరిహద్దులో డోక్లాం తరహలో మరిన్ని ప్రాంతాల్లో చైనా రహదారులను నిర్మించేందుకు ప్లాన్ వేస్తోంది. భారత్‌తో సరిహద్దు వెంట ఉన్న టిబెట్ జిన్ జియాంగ్ ప్రాంతాల్లో కొత్తగా రహదారులను నిర్మించేందుకు చైనా సన్నాహలు చేస్తోంది.
డోక్లామ్ వద్ద ఇండియా, చైనా సరిహద్దుల వెంటన సుమారు మూడున్నర మాసాల పాటు తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ ఉద్రిక్తతలను దౌత్యపరమైన చర్చల సహయంతో పరిష్కరించుకోవాలని బావించాయి
రెండు దేశాలు. అయితే డోక్లామ్ వద్ద రెండు దేశాల సైన్యాన్ని వెనక్కు తీసుకోవాలని నిర్ణయం తీసుకొన్నాయి.అయితే చైనా మాత్రం తన సైన్యం డోక్లామ్ వద్దే ఉంటుందని మాట మార్చింది.
ఈ రెండు దేశాల మద్య వివాదంగా ఉన్న డోక్లామ్ సమస్యను ప్రధాని మోడీ బ్రిక్స్ సమావేశం సందర్భంగా చైనా అధ్యక్షుడితో చర్చించే అవకాశం లేకపోలేదు.

డోక్లామ్ తరహలో మరిన్ని రోడ్లు
డోక్లామ్ తరహలో భారత్ సరిహద్దులో రోడ్ల నిర్మాణానికి చైనా ప్లాన్ చేస్తోంది. ఈ మేరకు టిబెట్ జిన్‌జియాంగ్ ప్రాంతంలో రోడ్డు నిర్మాణానికి సన్నాహలు చేస్తోంది. సరిహద్దులోని తమ భూబాగంలో రోడ్లు నిర్మించుకోవడం తమ హక్కంటూ చైనా తేల్చి చెబుతోంది. తమ హక్కును కాలరాసే అధికారం ఎవరికీ లేదని ప్రకటిస్తోంది.

భారత్ ఎందుకు భయపడుతోంది
తమ భూబాగంలో రోడ్లు నిర్మించుకొంటే భారత్ ఎందకు భయపడుతోందని చైనా ఆక్షేపణలు చేస్తోంది. చైనా రాజకీయ వ్యూహకర్త విక్టర్‌గో ఈ విషయమై భారత్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. మా భూబాగంలో ఏమైనా చేసుకోవచ్చని ఆపడానికి ఇండియాకు ఏ అవసరం ఉందని ఆయన ప్రశ్నించారు.

యుద్దం కోరుకోవడం లేదు
తాము ఇండియాతో యుద్దాన్ని కోరుకోవడం లేదని విక్టర్‌గో ప్రకటించారు. అయితే తమ దేశ భూబాగంలో తమ నైపుణ్యంతో రోడ్లు, భవనాల నిర్మించుకొంటున్నవిషయాన్ని విక్టర్‌గో ప్రకటించారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ నిర్మాణంలో తమకు మంచి చరిత్ర ఉందని ఆయన గుర్తుచేశారు. అయితే చిన్న వివాదాలు చివరకు యుద్దానికి దారితీసే అవకాశాలు లేకపోలేదని ఆయన నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు వివాదాలు పెద్ద యుద్దాలకు దారితీస్తాయనే అర్ధాన్ని స్పురింపచేసేలా విక్టర్‌గో మాట్లాడారు.

బ్రిక్స్ సమావేశంలో తేలేనా
బ్రిక్స్ సమావేశంలో డోక్లామ్ వివాదానికి తెరపడే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. బ్రిక్స్ సమావేశాన్ని పురస్కరించుకొని చైనా డోక్లామ్ వివాదానికి తాత్కాలిక విరామం ప్రకటించే దిశలో కొంత వ్యవహరించిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే బ్రిక్స్ సమావేశం సందర్భంగా పొరుగుదేశాలతో శాంతి, సుహృద్భావం నెలకొనేందుకుగాను చైనా కొంత వెనక్కు తగ్గినట్టు కన్పించిందని విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications