కాల్పుల విరమణ ఉల్లంఘనపై కేంద్రం సీరియస్-పాక్ కు స్ట్రాంగ్ వార్నింగ్..!
పహల్గాం దాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ కు బెంబేలెత్తిన పాకిస్తాన్ అమెరికా సాయం కోరడంతో డొనాల్డ్ ట్రంప్ సూచన మేరకు ఇవాళ ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. అయితే దీన్ని కేవలం మూడు గంటల వ్యవధిలోనే పాకిస్తాన్ ఉల్లంఘించింది. ఈ మూడు రోజుల్లో అతిపెద్ద డ్రోన్ దాడులకు పాల్పడుతోంది. దీనిపై భారత్ సీరియస్ అయింది. ఉద్దేశపూర్వకంగా కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతున్న పాకిస్తాన్ కు హెచ్చరికలు జారీ చేసింది.
ఇవాళ సాయంత్రం 6 గంటలకు భారత్-పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పంద ప్రకటన వెలువడింది. దీంతో అంతా సర్దుకున్నట్లేనని భావించిన వారికి నిరాశే మిగిలింది. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్ లోని పలు ప్రాంతాల్లో పాకిస్తాన్ డ్రోన్లతో విరుచుకుపడింది. ఆర్టిలరీ గన్స్, డ్రోన్లతో పాక్ దాడి చేసింది. అయితే ఈ దాడుల్ని భారత్ ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. సరిహద్దు నగరాలపై పాక్ వరుస డ్రోన్ దాడులు చేస్తుండటంతో పలు నగరాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పందించారు. పాకిస్తాన్ తీవ్ర కాల్పుల విరమణ ఉల్లంఘనలకు పాల్పడుతోందని ఆయన నిర్ధారించారు. తద్వారా ఇవాళ సాయంత్రం కుదిరిన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తోందని ఆరోపించారు. పాకిస్తాన్ ఇప్పటికైనా వెంటనే స్పందించి డ్రోన్ దాడులు ఆపేందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. లేకపోతే భారత్ తగిన విధంగా స్పందిస్తుందని పాకిస్తాన్ పాలకుల్ని హెచ్చరించారు. అయితే పాక్ ఉల్లంఘనల నేపథ్యంలో కాల్పుల విరమణ ఒప్పందాన్ని మాత్రం రద్దు చేయలేదు.
#WATCH | Delhi: Foreign Secretary Vikram Misri says, "An understanding was reached this evening between the DGMOs of India and Pakistan to stop the military action that was going on for the last few days. For the last few hours, this understanding is being violated by Pakistan.… pic.twitter.com/BNGnyvTnUH
— ANI (@ANI) May 10, 2025
మరోవైపు భారత్ పై పాక్ తాజా డ్రోన్ దాడులపై కేంద్రం అప్రమత్తమైంది. దేశంలో ఎలాంటి పరిస్దితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాష్ట్రాల సీఎస్ లను కోరారు. అలాగే నిఘా విభాధిపతులతోనూ మాట్లాడారు. తాజా పరిస్ధితిని ప్రధాని మోడీతో పాటు రక్షణమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు వివరిస్తున్నారు.
-
యుద్ధం ఆగిపోయింది. ట్రంప్ సంచలన ప్రకటన -
భారత్ కు గుడ్ న్యూస్ చెప్పిన పాకిస్థాన్..! ట్రంప్ సమక్షంలో..! -
నన్ను లొంగదీసుకోవడానికి నా భార్యను.. 30 నిమిషాలు పాటు -
Women's Reservation Act: మహిళా రిజర్వేషన్ల అమలుకు కేంద్రం రెడీ..! త్వరలో..! -
LPG Cylinder: సిలెండర్ 14.2 కేజీలే, గ్యాస్ 10 కేజీలు? కేంద్రం క్లారిటీ-అసలు ప్లాన్ ? -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications