Bhargavastra: భార్గవాస్త్రాన్ని ప్రయోగించిన భారత్- సీజ్ ఫైర్ తర్వాత తొలిసారి..!

పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతంగా పూర్తి చేస్తున్న తరుణంలో పాకిస్తాన్ తో కాల్పుల విరమణకు అంగీకరించాల్సి వచ్చింది. అయితే ఆపరేషన్ సింధూర్ తో సాధించిన విజయాలతో పోలిస్తే కాల్పుల విరమణ పెద్ద విషయం ఏమీ కాదన్న చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో భారత్ ఇవాళ మరో క్షిపణి ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసింది. దీనికి ఒడిశాలోని గోపాల్ పూర్ లో ఉన్న సీవార్డ్ ఫైరింగ్ రేంజ్ వేదికైంది.

పాకిస్తాన్ తో జరిగిన యుద్ధంలో భారత్ కు డ్రోన్ల రూపంలో అతి పెద్ద చికాకు ఎదురైంది. ముఖ్యంగా భారత్ క్షిపణుల్ని ప్రయోగిస్తుంటే వాటిని తట్టుకోలేక టర్కీ తయారీ డ్రోన్ల సాయంతో దాడికి పాకిస్తాన్ తీవ్రంగా ప్రయత్నించింది. అయితే వీటిని మన ఆయుధ రక్షణ వ్యవస్థలు దీటుగానే ఎదుర్కొని కూల్చేసాయి.. అయితే ఇలాంటి ముప్పుల్ని ఎదుర్కొనేందుకు భారత్ ఇవాళ భార్గవస్త్రాన్ని రంగంలోకి దించింది.

India successfully test fires Bhargavastra today after ceasefire agreement with pakistan

డ్రోన్ లతో పెరుగుతున్న ముప్పును ఎదుర్కొనేందుకు వీలుగా రూపొందిచిన భార్గవాస్త్ర అనే కొత్త తక్కువ-ధర కౌంటర్-డ్రోన్ వ్యవస్థను ఇవాళ విజయవంతంగా పరీక్షించింది. ఈ వ్యవస్థ యొక్క మైక్రో రాకెట్లను ఒడిశాలోని గోపాల్‌పూర్‌లోని సీవార్డ్ ఫైరింగ్ రేంజ్‌లో విజయవంతంగా పరీక్షించారు. ఈ ప్రయోగం విజయవంతమైందని ప్రభుత్వం ప్రకటించింది. హార్డ్ కిల్ మోడ్‌లో రూపొందించబడిన భార్గవాస్త్రకు 2.5 కి.మీ దూరంలో ఉన్న చిన్న, ఇన్‌కమింగ్ డ్రోన్‌లను గుర్తించి కూల్చే సామర్ధ్యం ఉంది.

సోలార్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ లిమిటెడ్ అభివృద్ధి చేసిన ఈ రాకెట్ కోసం మూడు పరీక్షలు ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ సీనియర్ అధికారుల సమక్షంలో జరిగాయని రక్షణ వర్గాలు తెలిపాయి. రెండు ప్రయోగాలు ఒక్కొక్కటిగా ఒక రాకెట్‌ను ప్రయోగించడం ద్వారా జరిగాయి. రెండు సెకన్లలోపు రెండు రాకెట్‌లను సాల్వో మోడ్‌లో ప్రయోగించడం ద్వారా మరో ప్రయోగం జరిగింది. ఎత్తైన ప్రాంతాలు సహా విభిన్న భూభాగాలలో సమర్ధంగా మోహరించడానికి రూపొందించబడిన ఈ వ్యవస్థ భారతదేశ సాయుధ దళాల ప్రత్యేక కార్యాచరణకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+