Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేశంలో మార్చి నుంచి 12-14ఏళ్లవారికి కరోనా వ్యాక్సినేషన్: ఎన్టీఏజీఐ చీఫ్ అరోరా

న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతోంది. వ్యాక్సినేషన్ కార్యక్రమం మొదలై ఆదివారంతో ఏడాది పూర్తయిన విషయం తెలిసిందే. తొలుత ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‍‌లైన్ వారియర్స్‌తో ప్రారంభమైంది. ఇప్పుడు 15 ఏళ్లు, ఆపై వారందరి కోసం విస్తరించారు.

తాజాగా, దేశంలో 12 నుంచి 14 ఏళ్లలోపు పిల్లలకు టీకాలు వేసే ప్రక్రియ మార్చిలో ప్రారంభించే అవకాశం ఉందని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్(ఎన్టీఏజీఐ)కి చెందిన కరోనా వర్కింగ్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ ఎన్‌కే అరోరా సోమవారం తెలిపారు. అప్పటివరకు 15-18 ఏళ్లలోపు వారికి వ్యాక్సినేషన్ పూర్తయ్యే అవకాశం ఉందని తెలిపారు.

India to begin vaccinating 12-14 year olds against Covid by March:NTAGI chief.

జనవరి 3న 15-18 ఏళ్ల మధ్య యువకులకు టీకాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 3.5 కోట్ల మంది ఈ వయస్సు బాలబాలికలు మొదటి డోస్ వేయించుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఇక, 60 ఏళ్లు, పైబడి,అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నవారికి ప్రికాషన్ డోసుల పంపిణీ కూడా జరుగుతున్న విషయం తెలిసిందే.

మరోవైపు దేశంలో కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 2.58 లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గతం రోజుతో పోల్చితే 5 శాతం స్వల్ప తగ్గుదల నమోదైనట్లు ఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజా కేసులతో దేశంలో మొత్తంగా 3.73 కోట్ల కేసులు ఇప్పటి వరకు నమోదయ్యాయి.
అందులో 8,209 ఓమిక్రాన్ కేసులు ఉన్నాయి. 4.43 శాతం యాక్టివ్ కేసులు ప్రస్తుతం ఉన్నట్లుగా గుర్తించారు. అదే సమయంలో రోజు వారీ పాజిటివిటీ రేటు శాతం 16.28 శాతం నుంచి 19.65 శాతానికి పెరిగింది. ఈ వారంలో 14.41 శాతం పాజిటివిటీ రేటు రికార్డు అయింది.

దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ఇప్పటి వరకు 157.20 కోట్ల మందికి పంపిణీ చేసినట్లు కేంద్రం ప్రకటించింది. మహారాష్ట్రలో కేసుల తీవ్రత భారీగా ఉంది. తాజాగా 41,327 కేసులు నమోదయ్యాయి. గతం రోజు కంటే 1,135 కేసులు తగ్గినట్లుగా వెల్లడించారు. మహారాష్ట్రలో తాజాగా 8 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా ఒమిక్రాన్ కేసులు మహారాష్ట్రలో 1,738గా నిర్దారించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం 18,286 కేసులు నమోదు కాగా, 28 మంది మరణించారు. 3.64 శాతం నుంచి 27.87 శాతానికి పాజిటివిటీ రేటు తగ్గింది. మూడు రెట్లు అధికంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ఢిల్లీ ప్రభుత్వం ప్రకటించింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+