ఇక బోర్డర్ కు మీరూ వెళ్లొచ్చు-కేంద్రం బంపర్ ఆఫర్- లిస్ట్ లో కార్గిల్, సియాచిన్..!

ఇప్పటివరకూ అత్యంత సున్నిత ప్రాంతాలుగా భావించి సైన్యానికి మాత్రమే ఎంట్రీ ఇచ్చిన మన దేశ సరిహద్దులు ఇప్పుడు సాధారణ పర్యాటకులకు సైతం స్వాగతం పలకబోతున్నాయి. ఓ కార్గిల్, మరో గల్వాన్, ఇంకో సియాచిన్.. ఇలా పాకిస్తాన్, చైనా, భూటాన్ తో ఉన్న సరిహద్దుల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. గతంతో పోలిస్తే సరిహద్దుల్లో తగ్గిన ఘర్షణలు, మన సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయన్న భావనను ప్రజల్లో కలిగేందుకు కేంద్రం ఈ చర్య తీసుకుంది.

నాలుగున్నరేళ్ల క్రితం లడఖ్ లోని నదీలోయ ప్రాంతం గల్వాన్ లో చైనా సైనికులతో జరిగిన ఘర్షణలో 20 మంది భారత సైనికులు చనిపోయారు. భారత్, భూటాన్, చైనా ల ఉమ్మడి సరిహద్దు ప్రాంతమైన డోక్లామ్ లో అంతకు ముందు 2017లో ప్రతిష్టంభన ఏర్పడింది. అలాంటి ప్రాంతాల్లో ఇప్పుడు పర్యాటకుల్ని అనుమతించాలని కేంద్రం నిర్ణయించింది. వీటితో పాటు గతంలో పెద్ద పెద్ద యుద్దాలకు సాక్ష్యంగా నిలిచిన కార్గిల్, సియాచిన్ వంటి ప్రాంతాల్లో సైతం పర్యాటకుల్ని అనుమతించబోతున్నారు.

india to promote border tourism now army to open these areas across LAC LOC for public visits

77వ ఆర్మీ డే సందర్బంగా ఇవాళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ "భారత్ రణభూమి దర్శన్" పేరుతో ఓ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. ఇందులో పర్యాటకుల కోసం 77 ప్రాంతాలు తెరవడంతో పాటు, వాటిలో ఎలా పర్యటించాలి, ఇతర వివరాలతో ప్రత్యేక వెబ్ సైట్ ను కూడా ప్రారంభిస్తారు. ఈ 77 సందర్శక ప్రాంతాల్లో ద్రాస్, కార్గిల్, సియాచిన్ బేస్ క్యాంప్ , లోంగేవాలా (రాజస్థాన్), బమ్ లా, కిబితు (అరుణాచల్ ప్రదేశ్) కూడా ఉన్నాయి. వీటి సందర్శనకు అనుమతులు, ప్రయాణ వివరాలు, ఇతర అవసరాల కోసం వన్ స్టాప్ సొల్యూషన్ ఇస్తారు. ఇన్‌క్రెడిబుల్ ఇండియా ప్రచారంలో భాగంగా పర్యాటక మంత్రిత్వ శాఖ ఈ వెబ్ సైట్ ప్రారంభిస్తోంది.

కేంద్రం ఇప్పుడు పర్యాటకుల్ని అనుమతించబోతున్న సరిహద్దు ప్రాంతాల్లో స్వాతంత్ర్యం తర్వాత యుద్ధాలు జరిగిన ప్రాంతాలు ఉన్నాయి. ఇందులో భారత్ గతంలో పాకిస్తాన్, చైనాతో యుద్దాలు చేసిన ప్రాంతాలు ఉన్నాయి. అలాగే థార్ ఎడారిలోని ఓ సరిహద్దు ప్రాంతం కూడా ఉంది. ఈ చారిత్రాత్మక యుద్దభూమి, సరిహద్దు ప్రాంతాలను అందుబాటులో ఉండే పర్యాటక ప్రాంతాలుగా మార్చేందుకు సైన్యం కృషి చేస్తోందని అధికారులు చెప్తున్న్నారు. గతంలో ఇక్కడ భద్రత, ఇతర కారణాలతో పర్యాటకుల్ని అనుమతంచలేదు. ఇప్పుడు సైన్యం అలాంటి ప్రాంతాల్లో ఎలా పనిచేస్తోందో తెలుసుకునేందుకు కూడా అనుమతిస్తున్నట్లు తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+