Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ఇప్పుడున్న పెట్రోల్, డీజిల్ ఇక దొరకదు.. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా బీఎస్-6 ఇంధనం..

కొత్త మోడల్ కార్లు, బైకుల అమ్మకాలు పెరిగినా.. వాటిని నడపడానికి వాడే పెట్రోల్, డీజిల్ గ్రేడు మాత్రం అప్ డేట్ కాలేదు. ప్రస్తుతం మనమంతా యూరో-4 లేదా భారత్ స్టేజ్(బీఎస్-6) ఇంధనాన్ని వాడుతున్నాం. బీఎస్-6 వాహనాలు అందుబాటులోకి వచ్చినప్పటికీ బీఎస్-4 గ్రేడ్ పెట్రోల్, డీజిల్ వినియోగిస్తున్నాం. దీనివల్లే కాలుష్య ఉద్గారాలను అనుకున్న స్థాయిలో కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఈ సమస్యకు పరిష్కారంగా మోదీ సర్కార్ ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా బీఎస్-6 ఇంధనాన్ని అందుబాటులోకి తేనుంది.

బీఎస్-6 ఇంధనమంటే..

బీఎస్-6 ఇంధనమంటే..


యూరో-6 గ్రేడ్ ఇంధనాన్ని ప్రపంచంలోనే అత్యంత శుద్ధి అయిన ఇంధనంగా పిలుస్తారు. ఏప్రిల్ 1 నుంచి మనకు అందుబాటులోకి రానున్నది కూడా అదే. కాకుంటే యూరో-6 పేరును మనం బీఎస్-6గా వ్యవహరిస్తాం. ప్రపంచంలోని మిగతా దేశాలకు సాధ్యపడని రీతిలో కేవలం మూడేండ్ల కాలంలోనే ఇండియా యూరో-6కు అప్ గ్రేడ్ కావడం విశేషం. యూరో-4 నుంచి యూరో-5 అవసరం లేకుండానే భారత్ నేరుగా యూరో-6 కి పొదబోతుండటం గమనార్హం.

లోకల్ పెట్రోల్ బంకులకు సప్లై ఇలా..

లోకల్ పెట్రోల్ బంకులకు సప్లై ఇలా..

ఏప్రిల్1 నుంచి దేశవ్యాప్తంగా బీఎస్-6 గ్రేడ్ ఇంధనాన్ని అందుబాటులోకి తెచ్చే విషయమై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐవోసీ) చైర్మన్ సంజీవ్ సింగ్ బుధవారం మీడియాతో మాట్లాడారు. దేశంలోని అన్ని రిఫైనరీలు 2019 చివరి నాటికే యూరో-6 పెట్రోల్, డీజిల్ ఉత్పత్తని ప్రారంభించాయని, ఏప్రిల్ 1 నుంచి దేశ వ్యాప్తంగా ప్రతి చుక్కను యూరో-6(బీఎస్-6) గ్రేడ్ గా మార్చబోతున్నాయని ఆయన తెలిపారు. ఇప్పటికే అన్ని రిఫైనరీలు బీఎస్-6 ఇంధన సరఫరాను మొదలుపెట్టాయని, దేశ వ్యాప్తంగా ఉన్న స్టోరేజ్ డిపోలకు ఈ ఇంధనం చేరుతోందని వివరించారు.

Recommended Video

    వరుసగా 9వ రోజూ తగ్గిన పెట్రోలు - డీజిల్ ధరలు | Oneindia Telugu
    లాభనష్టాలివే..

    లాభనష్టాలివే..

    యూరో-6 గ్రేడ్ ఇంధనం అత్యంత శుద్ధి చేసింది కావడంతో దీని ద్వారా కాలుష్య ఉద్గారాలు ఉత్పన్నం కాబోవు. కొన్నేళ్లుగా దేశ రాజధాని ఢిల్లీతోపాటు అన్ని ప్రధాన నగరాల్లో వాహన కాలుష్యం పెరిగిపోతున్న నేపథ్యంలో బీఎస్-6 రాకతో సమస్యకు అడ్డుకట్ట వేసినట్లవుతుంది. అయితే బీఎస్-6 ఇంధన ఉత్పత్తి కాస్త ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కాబట్టి.. ఏప్రిల్ 1 నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయి. ఈ పెరుగుదల లీటరుకు 50 పైసల నుంచి ఒక రూపాయి మధ్య ఉండే అవకాశముంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+