India Today Axis My India Exit poll : హిమాచల్ లో కాంగ్రెస్ కు స్వల్ప ఆధిక్యం-సీట్లు ఎన్నంటే ?

ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ హిమాచల్ ప్రదేశ్ పై నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో విపక్ష కాంగ్రెస్ కు స్వల్ప మొగ్గు లభించింది. అధికారంలో ఉన్న బీజేపీ గట్టి పోటీ ఇచ్చినా తుది ఫలితాల్లో వెనుకబడుతున్నట్లు ఎగ్జిట్ పోల్ అంచనాలు చెప్తున్నాయి.

ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ లో 68 సీట్లున్న హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ కు 30 నుంచి 40 స్ధానాలు లభించవచ్చని తేలింది. అలాగే బీజేపీకి 24-34 సీట్లు లభించవచ్చని తేలింది. ఆప్ మాత్రం ఖాతా తెరిచే అవకాశాలు లేవని ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనా వేస్తోంది. ఇతరులకు మాత్రం 4 నుంచి 8 స్దానాలు దక్కే అవకాశమున్నట్లు ఈ ఎగ్జిట్ పోల్ చెబుతోంది.

 India Today Axis My India exit poll gives slight edge to congress in himchal pradesh

ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ అంచనాల ప్రకారం చూస్తే అధికార బీజేపీపై ప్రజావ్యతిరేకత కనిపిస్తోంది. దీన్ని క్యాష్ చేసుకోవడంలో కాంగ్రెస్ పూర్తిగా సఫలం కాలేకపోయినా స్వల్ప ఆధిక్యం మాత్రం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. వాస్తవానికి మిగతా ఎగ్జిట్ పోల్స్ సైతం హిమాచల్ ప్రదేశ్ లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగినట్లు అంచనా వేశాయి. వాటితో పోలిస్తే ఇండియా టుడే యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్ మాత్రం కాంగ్రెస్ కు స్వల్ప ఆధిక్యం కట్టబెట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+