లేడీ రిపోర్టర్ ని బెదిరించిన యువకులు.. అదీ లైవ్ లో.. వీడియో వైరల్!
ట్రిపుల్ తలాక్ పై విద్యార్థినుల స్పందన గురించి తెలుసుకునేందుకు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి వెళ్లిన ఇండియా టుడే జర్నలిస్ట్ ఇల్మా హాసన్‌పై అక్కడి యువకులు హద్దులు మీరి ప్రవర్తించారు.
లక్నో: సుప్రీం తీర్పుపై నేపథ్యంలో ట్రిపుల్ తలాక్ పై విద్యార్థినుల స్పందన గురించి తెలుసుకునేందుకు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి వెళ్లిన ఇండియా టుడే జర్నలిస్ట్ ఇల్మా హాసన్‌పై అక్కడి యువకులు హద్దులు మీరి ప్రవర్తించారు.
ట్రిపుల్ తలాక్ ను రద్దు చేస్తున్నట్లు నిన్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై దేశవ్యాప్తంగా ముస్లిం యువతుల నుంచి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థినుల స్పందన తెలుసుకునేందుకే జర్నలిస్ట్ ఇల్మా హాసన్ అక్కడికి వెళ్లారు.

అక్కడి విద్యార్థినులతో ఆమె లైవ్‌లో మాట్లాడిస్తుండగా అక్కడికి వచ్చిన కొంత మంది యువకులు జర్నలిస్ట్ ఇల్మా హాసన్ చుట్టుముట్టారు. ఎవరి పర్మిషన్ తీసుకొని ఇక్కడికి వచ్చావ్? అంటూ లైవ్‌లోనే బెదిరించారు.
సుమారు పది మంది యువకులు ఆమెను చుట్టుముట్టి ఆ లైవ్ జరగకుండా అడ్డుకున్నారు. కెమెరామెన్ ని కూడా బెదిరించారు. దాదాపు అర్ధగంటపాటు ఆ యువకులు తనను చుట్టుముట్టారని ఇల్మా హాసన్ తెలిపింది. ఈ విషయంపై తాను పోలీసులకు ఫిర్యాదు చేశానంటూ ఆమె పేర్కొన్నారు.
దీనికి సంబంధించిన వీడియోను జర్నలిస్ట్ రాహుల్ కన్వాల్ తన సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేశారు. విద్యార్థినులతో మాట్లాడించడానికి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. ఈ గుండాగిరీ ఏంటని ప్రశ్నించారు.
యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ విషయంపై స్పందించి జర్నలిస్ట్ ఇల్మా హాసన్ ను వేధించిన యువకులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆయన పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటివరకు ఆరు లక్షల మంది చూశారు. ఆ యువకుల తీరుపై నెటిజన్లు కూడా మండిపడుతున్నారు.












Click it and Unblock the Notifications