India Today-My Axis Exit Poll 2023 : ఛత్తీస్ ఘడ్ లో మళ్లీ కాంగ్రెస్ కే పట్టం-బీజేపీకి రెండో స్ధానం..
గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలో ఈ నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీదే విజయం అని తేలిపోయింది. ఇండియా టుడే-మై యాక్సిస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఛత్తీస్ ఘడ్ లో విజయం సాధించబోతోందని తేలింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అధికారం నిలబెట్టుకోవడం ఖాయమని తేలిపోయింది. విపక్ష బీజేపీ ఈసారి కూడా రెండోస్ధానంతో సరిపెట్టుకోవాల్సిన పరిస్దితి.
Recommended Video

ఇండియా టుడే-మై యాక్సిస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ ప్రకారం 90 సీట్లు ఉన్న ఛత్తీస్ ఘడ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 40-50 సీట్లు గెల్చుకుంటుందని నిర్ధారణ అయింది. అలాగే రెండో స్దానంలో ఉన్న బీజేపీ కేవలం 36-46 సీట్లతో సరిపెట్టుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఇతరులకు 1-5 సీట్లు దక్కబోతున్నాయి. ఛత్తీస్ ఘడ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలతో రెండోసారి అధికారంలోకి రావడం ఖాయమని ఇండియా టుడే-మై యాక్సిస్ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే తేల్చింది.

కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దాలను నిలబెట్టుకోవడం, మరోసారి సంక్షేమ అజెండాతో ముందుకెళ్లడంతో ఈసారి గెలుపు సులువు కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే బీజేపీ అనుసరిస్తున్న విధానాలు గిరిజనుల్లో అసంతృప్తి నింపుతున్నట్లు మరోసారి స్పష్టమైంది. ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బగేల్ లక్ష్యంగా బీజేపీ అగ్రనేతలంతా ప్రచారం చేసినా ఆ పార్టీ ముందంజలో లేదని తేలిపోయింది. డిసెంబర్ 3న ఇక్కడ ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు ప్రకటిస్తారు.












Click it and Unblock the Notifications