వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమెరికా మానవ హక్కుల ఉల్లంఘనలపై మాట్లాడేందుకు వెనుకాడబోం: యూఎస్‌కు జైశంకర్ షాక్

|
Google Oneindia TeluguNews

వాషింగ్టన్: సత్సంబంధాలు కొనసాగిస్తామంటూనే పరోక్షంగా బెదిరింపులకు పాల్పడుతున్న అమెరికాకు భారత్ గట్టి షాకిచ్చింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడుల నేపథ్యంలో అమెరికా పర్యటనకు వెళ్లిన భారత విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్.. యూఎస్‌కు దిమ్మదిరిగేలా జవాబిచ్చారు. ప్రతి విషయంలోనే స్పష్టమైన వైఖరిని తెలియజేశారు.

అమెరికాలో మానవ హక్కుల పరిస్థితిపైనా మాట్లాడతాం: జైశంకర్

అమెరికాలో మానవ హక్కుల పరిస్థితిపైనా మాట్లాడతాం: జైశంకర్


భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ అమెరికా చేసిన వ్యాఖ్యలకు జైశంకర్ సూటిగా బదులిచ్చారు. అమెరికాలో మానవహక్కుల పరిస్థితిపై తమకు కూడా అభిప్రాయాలుంటాయని, చర్చ జరిగినప్పుడు వాటి గురించి మాట్లాడేందుకు వెనుకాడబోమని తేల్చిచెప్పారు. దీంతో అమెరికా అంతర్మథనంలో పడిపోయింది.

భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలంటూ అమెరికా ప్రస్తావన

భారత్‌లో మానవ హక్కుల ఉల్లంఘనలంటూ అమెరికా ప్రస్తావన


వాషింగ్టన్‌లో భారత్, అమెరికాకు మధ్య 2+2 స్థాయిలో చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఈ సమయంలోనే అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకన్ మాట్లాడుతూ.. భారతదేశంలో మానవ హక్కుల ఉల్లంఘనలు పెరగడాన్ని గమనించామన్నారు. వీటికి ముగింపు పలికే వరకు ఈ అంశంపై నిరంతరం ఆ దేశంతో సంప్రదింపులు జరుపుతుంటామని వ్యాఖ్యానించారు. కాగా, పర్యటన ముగింపులో భాగంగా దీనిపై జైశంకర్‌కు అక్కడి భారతీయ పాత్రికేయుల నుంచి ప్రశ్నలు ఎదురయ్యాయి. ఈ సందర్భంగా జైశంకర్ స్పందిస్తూ.. తమ మధ్య మానవ హక్కుల ఉల్లంఘన అంశం ప్రస్తావనకు రాలేదన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా ద్వైపాక్షిక సంబంధాలు, ఇండో-పసిఫిక్ అంశాలు, పాకిస్థాన్‌లో నాయకత్వ మార్పు, శ్రీలంక సంక్షోభం, ప్రపంచ దేశాల ఆహార భద్రత వంటి అంశాలపై చర్చించామని జైశంకర్ తెలిపారు.

అమెరికాకు షాకిచ్చిన జైశంకర్.. రష్యా దిగుమతులపైనా..

అమెరికాకు షాకిచ్చిన జైశంకర్.. రష్యా దిగుమతులపైనా..


ఇక మానవ హక్కుల విషయంపై స్పందిస్తూ.. ప్రతి ఒక్కరూ భారత్‌పై ఒక అభిప్రాయానికి కలిగి ఉండటానికి అర్హులు. అదే విధంగా వారిపై తాము అభిప్రాయాలను కలిగి ఉంటాం. అందుకే ఆ విషయంపై చర్చ జరిగినప్పుడు.. మా అభిప్రాయాలు చెప్పడానికి వెనకాడబోమని జైశంకర్ స్పష్టం చేశారు. అమెరికా తోపాటు ఇతర దేశాల మానవ హక్కుల పరిస్థితిపై తమకు అభిప్రాయాలు ఉంటాయని, ఈ దేశంలో మానవ హక్కుల సమస్య తలెత్తినప్పుడు.. అది కూడా మన కమ్యూనిటీకి చెందినప్పుడు మేము వాటిని ఖచ్చితంగా పరిగణలోకి తీసుకుంటాం అని భారత వైఖరని జైశంకర్ స్పష్టం చేశారు. భారత్ నుంచి ఊహించని సమాధానం రావడంతో అమెరికా సందిగ్ధంలో పడిపోయింది. జైశంకర్ ఎదురుదాడితో ఇకపై భారత్ గురించి మాట్లాడే సమయంలో అమెరికా జాగ్రత్తగా వ్యవహారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. రష్యా నుంచి చమురు దిగుమతులపైనా అమెరికా అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి కూడా జైశంకర్ ఘాటుగానే స్పందించారు. రష్యా నుంచి అత్యధిక చమురు ఐరోపా దేశాలే దిగుమతి చేసుకుంటున్నాయన్నారు. భారత్ నెల రోజుల దిగుమతులు.. ఐరోపా ఒక రోజు దిగుమతుల కంటే కూడా తక్కువేనని స్పష్టం చేశారు. మీరు రష్యా నుంచి దిగుమతుల గురించి మాట్లాడాలంటే మొదట ఐరోపా దేశాలకు సూచించాలని తేల్చి చెప్పారు.

English summary
India, too, has views on human rights situation in US: Jaishankar hits back.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X