రష్యాపై భారత్ యూటర్న్ ? బుచా హత్యలపై మరోసారి ఫైర్-పార్లమెంటులో తప్పుబట్టిన కేంద్రం
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర మొదలై నెలన్నర కావస్తున్న ఏమాత్రం ఫలితం రాకపోగా దారుణాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్ లోని బుచా పట్టణంలో రష్యా సేనలు స్ధానికుల్ని దారుణంగా చంపడంపై అంతర్జాతీయంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో రష్యాకు పరోక్షంగా మద్దతునిస్తూ వచ్చిన భారత్ కూడా యూటర్న్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. బుచా హత్యల్ని పార్లమెంటులో కేంద్రం తప్పుబట్టింది. వీటిపై స్వతంత్ర విచారణకు విదేశాంగమంత్రి జైశంకర్ డిమాండ్ చేశారు.

ఉక్రెయిన్ లో రష్యా అకృత్యాలు
ఉక్రెయిన్ లో రష్యా దురాగతాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే ఉక్రెయిన్ ను సర్వనాశనం చేసిన రష్యా.. ఇంకా యుద్ధం ముగియకపోవడంతో సామాన్య పౌరుల్ని సైతం లక్ష్యంగా చేసుకుని రెచ్చిపోతోంది. ఉక్రెయిన్ లోని బుచా పట్టణంలో సామాన్య పౌరులపై రష్యా సాగించిన మారణకాండ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ఆగ్రహావేశాలకు కారణమవుతోంది. రష్యా వైఖరిని ఏ ఒక్క దేశం కూడా పూర్తిగా సమర్ధించలేని పరిస్ధితి. పశ్చిమదేశాలు ఆంక్షల కొరడా విసురుతున్నా లెక్కచేయకుండా రష్యా సాగిస్తున్న దురాగతాలపై భారత్ కు కూడా విసుగు వచ్చేసినట్లు తెలుస్తోంది.

బుచా హత్యల్ని ఖండించిన భారత్
ఉక్రెయిన్ లోని బుచా పట్టణంలో రష్యా సేనలు అవమానవీయంగా స్ధానికుల్ని హతమార్చిన ఘటనపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇప్పటికే బుచా హత్యల్ని తప్పుబట్టిన భారత్.. ఇవాళ పార్లమెంటులో దీనిపై వివరణ కూడా ఇచ్చింది. ఇందులోనూ బుచా హత్యల్ని ఖండిస్తున్నట్లు విదేశాంగమంత్రి జై శంకర్ వెల్లడించారు. ఉక్రెయిన్ సంక్షోభంపై ఇవాళ లోక్ సభలో జరిగిన చర్చలో మాట్లాడిన జైశంకర్.. ఈ హత్యలపై స్వతంత్ర విచారణ చేపట్టాలన్న డిమాండ్ కు మద్దతిస్తున్నట్లు తెలిపారు.

రష్యాకు భారత్ సందేశం
ఉక్రెయిన్, రష్యా మధ్య చర్చలను భారత్ ప్రోత్సహిస్తోందని, శత్రుత్వాలను తక్షణమే నిలిపివేయాలని జై శంకర్ పార్లమెంటు వేదికగా పిలుపునిచ్చారు. ఇదే సందేశాన్ని భారత్ లో తాజాగా పర్యటించి్న రష్యా విదేశాంగ మంత్రి లావ్‌రోవ్‌కు అందించినట్లు జైశంకర్ వెల్లడించారు. ఉక్రెయినా్ పోరు ఆపే విషయంలో భారత్ జోక్యం చేసుకునే అవకాశం ఉంటే ఆ అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని కూడా తెలిపారు. తద్వారా మధ్యవర్తిత్వానికి సిద్ధమని జై శంకర్ స్పష్టం చేశారు. సాధారణ పౌరులు అదనపు, అనివార్యమైన సమస్యలకు గురికాకుండా చూడడమే భారతదేశం యొక్క ఉత్తమ ప్రయోజనాలని ఆయన వెల్లడించారు.

రష్యాపై యూటర్న్ తీసుకున్నట్లేనా ?
ఉక్రెయిన్ తో చర్చలు జరపాలని తాము కోరుతుంటే వినకుండా అక్కడ హత్యల ద్వారా మారణకాండను ప్రోత్సహిస్తున్న రష్యా వైఖరిపై భారత్ అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓవైపు అమెరికాతో పాటు పశ్చిమదేశాల నుంచి ఉన్న ఒత్తిడిని కూడా లెక్కచేయకుండా రష్యాకు మద్దతిస్తుంటే ఆ దేశం మాత్రం ఉక్రెయిన్ లో దారుణాలకు పాల్పడటంపై కేంద్రం అసంతృప్తిగా ఉంది.దీంతో ఇవాళ పార్లమెంటులో తన వైఖరిని మరోసారి కుండబద్దలు కొట్టినట్లయింది. రష్యా ఇదే తీరు కొనసాగిస్తే మాత్రం భవిష్యత్తులో యూటర్న్ తీసుకున్నా ఆశ్చర్యం లేదనే వాదన వినిపిస్తోంది.
-
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!? -
అండగా నిలిచిన భారత్ కు థ్యాంక్స్: ఇరాన్ సంచలన ప్రకటన -
మూడేళ్లకోసారి వచ్చినా.. పెట్టిన 150 రూపాయలకు న్యాయం చేస్తావ్ అన్నా.. -
రేషన్ సరఫరా లో కీలక మార్పులు, తాజా మార్గదర్శకాలు..!! -
దేశవ్యాప్తంగా 14 అర్ధరాత్రి నుంచి పెట్రోల్ ధరలు పెంపు..? ఏఏ నగరాల్లో ఎంత పెరుగుతుంది..? -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- ఆందోళనకరం -
విశాఖ - సికింద్రాబాద్ వందే భారత్ కు మరో హాల్ట్, ఆ 9 ఎక్స్ప్రెస్ లు ఇక రెగ్యులర్ గా..!! -
రూపాయి పని అయిపోయిందా? చరిత్ర చూడని పతనం! -
గుడ్ న్యూస్: రోడ్ ట్యాక్స్ లేదు.. రిజిస్ట్రేషన్ ఫీజు సగమే! -
10th Class Results అప్పుడే..! పది ఫలితాలపై కీలక ప్రకటన












Click it and Unblock the Notifications