India TV-CNX Opinion Poll: ఎన్డీయే వర్సెస్ ఇండియా పోరులో గెలిచేదెవరంటే ? ఫుల్ క్లారిటీ..!
దేశంలో సార్వత్రిక ఎన్నికల ఫీవర్ పెరుగుతోంది. దేశంలో తాజాగా మారుతున్న పరిణామాలు, అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే ఎవరు గెలవబోతున్నారనే దానిపై స్పష్టమైన అంచనాల్ని వెలువరించింది. ఇందులో ఎన్డీయే, ఇండియా కూటమి పార్టీల తాజా పరిస్దితి స్పష్టమైంది.
ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ అంచనాల ప్రకారం లోక్‌సభ ఎన్నికలు ఇప్పుడే జరిగితే ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డీఏ) 543 సభల్లో 315 సీట్లతో స్పష్టమైన మెజారిటీ సాధిస్తుందని తేలింది. గతవారం 282 సీట్లకు సంబంధించిన ఫలితాలు వెల్లడి కాగా..ఇవాళ పూర్తి ఫలితాలను ప్రకటించారు. ఇందులో ఎన్డీయే తిరిగి పూర్తి మెజారిటీతో అధికారంలోకి రావడం ఖాయమని తేలింది.

తాజా అంచనాల ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని విపక్ష ఎన్డీయే కూటమి 172 లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకుంటుందని అంచనా వేశారు. అలాగే ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులతో సహా ఇతరులకు 56 సీట్లు రావచ్చని అంచనా. లోక్‌సభలో అధికార భారతీయ జనతా పార్టీ బీజేపీ బలం ఈసారి 303 నుంచి 293కి తగ్గవచ్చని ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ పేర్కొంది. మరోవైపు 52 సీట్లతో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ఈసారి తన సంఖ్యను 70కి పెంచుకోవచ్చని అంచనా.
టీఎంసీ ఈసారి లోక్‌సభలో 30 స్థానాలతో మూడవ అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని అంచనా. గతంలో 22 స్థానాలు గెలిచిన టీఎంసీ ఈసారి 8 సీట్లు పెంచుకోనుంది. అలాగే తమిళనాడులో అధికార డీఎంకే కూడా మూడు సీట్లు తగ్గుతున్నా 21 సీట్లతో లోక్ సభలో నాలుగో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించవచ్చని అంచనా. ఉద్ధవ్ ఠాక్రే శివసేన ప్రస్తుతం తన సంఖ్యను ఆరు నుండి ఎనిమిదికి పెంచుకోవచ్చని అంచనా వేశారు.
అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ ప్రస్తుతం ఎన్నికలు జరిగితే దాని సీట్లను ప్రస్తుతం ఉన్న ఒకటి నుంచి ఆరుకు పెంచుకోనుంది. నవీన్ పట్నాయక్ బిజూ జనతాదళ్ తన సంఖ్యను 12 నుండి 13కి పెంచుకోవచ్చని అంచనా. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన (షిండే) బలం పన్నెండు నుంచి నాలుగుకు తగ్గవచ్చని అంచనా. యూపీలో బీజేపీ ఈసారి 80 సీట్లకు గానూ 73 గెల్చుకోనుంది. దాని మిత్రపక్షం అప్నా దళ్ రెండు సీట్లు గెలుచుకోవచ్చని అంచనా. యూపీలో మిగిలిన ఏడు స్థానాలను ప్రతిపక్ష కూటమి ఇండియా గెలుచుకోవచ్చని సర్వే అంచనా వేసింది.
గుజరాత్‌లోని మొత్తం 26 లోక్‌సభ స్థానాలను, ఉత్తరాఖండ్‌లోని మొత్తం ఐదు స్థానాలను బీజేపీ క్లీన్ స్వీప్ చేయనుంది. కర్నాటకలో 28 లోక్‌సభ స్థానాలకు గాను ఎన్‌డిఎ 18 స్థానాలను గెలుచుకోవచ్చని అంచనా. ఇండియా కూటమి పది సీట్లు గెలిచే అవకాశముంది. అలాగే కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ తో కూడిన ఇండియా కూటమి మొత్తం 20 లోక్ సభ సీట్లను గెల్చుకునే అవకాశం ఉంది. బెంగాల్లో ఇండియా కూటమికి 32 సీట్లు లభించే అవకాశముంది. ఇక్కడ బీజేపీకి 10 సీట్లు దక్కొచ్చని అంచనా.












Click it and Unblock the Notifications