India TV-CNX Opinion Poll : లోక్ సభ పోరులో ఎన్డీయే- ఇండియా హోరాహోరీ- అధికారపార్టీలదే హవా
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్. ఇవాళ ఫలితాలు వెల్లడించింది. ఇందులో 282 లోక్ సభ సీట్లకు చేసిన సర్వేలో ఎన్డీయే కూటమికి 118, ఇండియా కూటమికి 110 సీట్లు వస్తాయని వెల్లడించింది. అంటే ఇరు కూటముల మధ్య హోరాహోరీ తప్పదని తేలిపోతోంది. అలాగే బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లోనూ కాషాయ పార్టీ హవా కొనసాగుతోంది. ప్రాంతీయ పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మాత్రం ఆయా పార్టీలే లీడ్ లో ఉన్నాయి.

ఒడిశాలో ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ప్రకారం ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే బీజేపీకి 41 శాతం ఓట్లు, అధికార బిజూ జనతాదళ్ (బీజేడీ)కి 45 శాతం, కాంగ్రెస్‌కు 11 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని తేలింది. సీట్ల వారీగా చూస్తే బీజేపీకి 8 లోక్‌సభ సీట్లు, బీజేడీకి 13 సీట్లు వస్తాయని సర్వే అంచనా వేసింది.
ఈ ఒపీనియన్ పోల్ ప్రకారం పశ్చిమ బెంగాల్‌లో బీజేపీకి 10 సీట్లు లభించే అవకాశం ఉండగా.. అధికార టీఎంసీకి 30 సీట్లు వచ్చే అవకాశం ఉందని తేలింది. ఓట్ల శాతం ప్రకారం బీజేపీకి 36 శాతం రావచ్చని, తృణమూల్ కాంగ్రెస్‌కు 48 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేశారు. లెఫ్ట్ ఫ్రంట్‌కు 6 శాతం, కాంగ్రెస్‌కు 7 శాతం ఓట్లు వస్తాయని అంచనా. 2019 ఫలితాలతో పోలిస్తే ఈసారి లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ బెంగాల్లో 8 ఎంపీ సీట్లు కోల్పోవచ్చని అంచనా. ఆ మేరకు టీఎంసీ వీటిని గెల్చుకోనుంది.
ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ప్రకారం రాజస్థాన్‌లో బీజేపీకి 49 శాతం ఓట్లు రావచ్చని, కాంగ్రెస్‌కు 41 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేశారు. రాజస్తాన్ లో బీజేపీ 23 లోక్‌సభ సీట్లు గెలుచుకోవచ్చని, కాంగ్రెస్‌కు 2 వచ్చే అవకాశం ఉందని సర్వే అంచనా వేసింది. 2019తో పోలిస్తే ఈసారి బీజేపీ ఓ సీటును కోల్పోవచ్చని, కాంగ్రెస్ రెండు సీట్లు గెల్చుకునే అవకాశం ఉందని తేలింది. మరోవైపు మధ్యప్రదేశ్‌లో బీజేపీకి 48 శాతం ఓట్లు రావచ్చని, కాంగ్రెస్‌కు 41 శాతం ఓట్లు రావచ్చని ఈ పోల్ అంచనా వేసింది. దీని ప్రకారం చూస్తే బీజేపీ 25 లోక్‌సభ స్థానాలు, కాంగ్రెస్ 4 స్థానాలు గెలుచుకోవచ్చని సర్వే అంచనా వేసింది. 2019 ఫలితాలతో పోల్చితే ఈసారి ఇక్కడ బీజేపీ 3 సీట్లు కోల్పోతుందని, కాంగ్రెస్ ఆ సీట్లు కైవసం చేసుకుంటుందని తేలింది.
అలాగే ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీకి 46 శాతం, కాంగ్రెస్‌కు 43 శాతం ఓట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. రాష్ట్రంలో బీజేపీ 7 లోక్‌సభ స్థానాలను గెలుచుకోనుందని, కాంగ్రెస్‌కు 4 సీట్లు వచ్చే అవకాశం ఉందని తెలిపింది. 2019 ఫలితాలతో పోల్చితే ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీ 2 సీట్లు కోల్పోతుండగా, కాంగ్రెస్ ఆ 2 సీట్లు కైవసం చేసుకోనుంది. తమిళనాడులో డీఎంకేకు 31 శాతం ఓట్లు రావచ్చని, ఏఐఏడీఎంకేకు 25 శాతం ఓట్లు రావచ్చని ఈ సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్‌కు 11 శాతం, బీజేపీకి 7 శాతం ఓట్లు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. తమిళనాడులో డీఎంకే అతిపెద్ద పార్టీగా అవతరిస్తుందని, మొత్తం 21 ఎంపీ సీట్లు గెలుచుకోవచ్చని, ఏఐఏడీఎంకేకు 6 సీట్లు రావచ్చని సర్వే అంచనా వేసింది.
ఇండియా టీవీ-సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ ప్రకారం కర్ణాటకలో బీజేపీకి 44 శాతం ఓట్లు రావచ్చని తేలింది. కాంగ్రెస్‌కు 40 శాతం, జేడీఎస్‌కు 11 శాతం ఓట్లు రావచ్చని అంచనా వేసింది. సీట్ల వారీగా చూస్తే బీజేపీకి 16, కాంగ్రెస్‌కు 10, జేడీఎస్‌కు 2 దక్కే అవకాశం ఉంది. 2019 ఫలితాలతో పోల్చి చూస్తే కర్ణాటకలో బీజేపీ 9 లోక్‌సభ స్థానాలను కోల్పోవచ్చని తేలింది. కాంగ్రెస్ 9 స్థానాలు లాభపడవచ్చని తేలింది.
మణిపూర్, సిక్కిం, మేఘాలయ, మిజోరం, త్రిపుర, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్‌తో సహా ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ 8 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని ఈ సర్వే తేల్చింది. కాంగ్రెస్ 3 గెలుచుకోవచ్చని అంచనా. అస్సాంలో బీజేపీకి అస్సాంలో 42 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని, సీట్ల అంచనా ప్రకారం బీజేపీ 12 లోక్‌సభ స్థానాలను గెలుచుకునే అవకాశం ఉందని, కాంగ్రెస్‌కు ఒకటి లభించవచ్చని తేలింది.
కేరళలోని 20 లోక్‌సభ స్థానాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 16 సీట్లు గెలుచుకోనుండగా, ఎల్‌డీఎఫ్‌కు 4 సీట్లు వస్తాయని అంచనా. 2019 ఫలితాలతో పోల్చి చూస్తే కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ 3 లోక్‌సభ స్థానాలను కోల్పోనుండగా.. ఎల్‌డిఎఫ్ ఆ 3 స్థానాలను కైవసం చేసుకోనుంది. కేరళలో ఎల్‌డీఎఫ్‌కు 39 శాతం ఓట్లు రావచ్చని, కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ 47 శాతం ఓట్లను పొందవచ్చని అంచనా వేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 13 శాతం ఓట్లు రావచ్చు కానీ ఒక్క సీటు కూడా గెలవలేకపోవచ్చని తేల్చింది.
-
9వ తరగతి విద్యార్ధినిలకు సైకిల్లు, టెన్త్ విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు..! -
వేసవిలో వాకింగ్ ఎవరికి ఏ సమయంలో మంచిది- ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications