తాజా సర్వే: లోక్‌సభ ఎన్నికల్లో దక్షిణాదిలో సత్తా చాటనున్న బీజేపీ, ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లంటే?

న్యూఢిల్లీ: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో దక్షిణాదిలో భారతీయ జనతా పార్టీ సత్తా చాటనుందని తాజా సర్వే తేల్చింది. గతంలో కంటే ఎక్కువ సీట్లను బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలిపింది. దక్షిణాదిలో ఆంధ్రప్రదేశ్ మినహా మిగతా రాష్ట్రాల్లో బీజేపీ 2019 కంటే ఎక్కువ సీట్లను గెలుచుకోనుందని ఇండియా టీవీ - సీఎన్ఎక్స్ ఒపీనియన్ పోల్ అంచనా వేసింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రమే జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ ఒక్క సీటు కూడా గెలుచుకునే అవకాశం లేదని ఈ సర్వే ఫలితాలు స్పష్టం చేశాయి. తెలంగాణ, కేరళ, తమిళనాడులో బీజేపీ గతంలో కంటే మెరుగైన సీట్లు గెలుచుకునే అవకాశముందని పేర్కొంది. కర్ణాటకలో 22 సీట్లు గెలుచుకునే అవకాశముందని వెల్లడించింది.

India TV-CNX Poll survey BJP may win 3 seats in Kerala in big shock Congress-led UDF leads with 11

కేరళ, తమిళనాడులో బీజేపీ గతంలో ఒక్క సీటూ గెలుచుకోలేదు. కానీ, 2024 లోక్‌సభ ఎన్నికల్లో తమిళనాడులో 5, కేరళలో 3 సీట్లు గెలుచుకునే అవకాశముందని ఈ సర్వే వెల్లడించింది. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో గతంలో 25 సీట్లు గెలిచిన బీజేపీ ఇప్పుడు 22కు పరిమితమయ్యే అవకాశముందని తెలిపింది.

తెలంగాణలో కాంగ్రెస్ 9, బీజేపీ 5, బీఆర్ఎస్ 2 సీట్లు గెలుచుకునే అవకాశముందని తాజా సర్వే పేర్కొంది. మొత్తంగా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ 35 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం తెలుస్తోంది.

రాష్ట్రాల వారీగా బీజేపీకి ఎన్ని సీట్లంటే?

కర్ణాటకలో మొత్తం సీట్లు: 28
బీజేపీ: 22
కాంగ్రెస్: 04
జేడీఎస్: 02

కేరళలో మొత్తం సీట్లు: 20
యూడీఎఫ్: 11
ఎల్డీఎఫ్: 06
బీజేపీ: 03

తమిళనాడులో మొత్తం సీట్లు: 40
డీఎంకే: 20
కాంగ్రెస్: 06
బీజేపీ: 05
అన్నాడీఎంకే: 04
ఇతరులు: 05.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+