దేశంలోని ఈ రాష్ట్రాల్లో వచ్చే 3-5 రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు: ముంబై అలర్ట్
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఉత్తర భారతదేశంలోనూ వేగంగా విస్తరిస్తున్నాయి. రాజస్థాన్, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో వచ్చే 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లడఖ్, రాజస్థాన్, ఢిల్లీ, పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయి.

ఉత్తరాదికి చురుగ్గా నైరుతి రుతుపవనాలు
ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానాలో వచ్చే మూడు రోజుల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతుండటంతో దేశ రాజధాని ఢిల్లీల్లోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రహదారులపైకి వరద నీరు చేరింది. ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు
మరోవైపు, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ రాజస్థాన్, హర్యానా, ఛండీగఢ్, ఢిల్లీలో జులై 2 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని తావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రానున్న నాలుగు ఐదు గంటల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో వచ్చే ఐదు రోజులపాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఉరుములుమెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపింది. బీహార్, జార్ఖండ్, ఒడిశా, గంగా పరివాహక పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని పేర్కొంది.
Recommended Video


4న ఒడిశాలో అతి భారీ వర్షాలు, దక్షిణాది రాష్ట్రాల్లోనూ
జులై 4న ఒడిశాలోని చాలా ప్రాంతాల్లో భారీ నుంచ అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. దక్షిణాది రాష్ట్రాలైన కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కొంకణ్, గోవా ప్రాంతాల్లోనూ జులై 2 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ముంబైలో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు బయటికి వెళ్లినప్పుడు తగు జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.












Click it and Unblock the Notifications