హిరోషిమాలో కీలక ప్రకటన చేసిన ప్రధాని మోదీ- ఆ తీర్మానంపై సంతకం

న్యూఢిల్లీ/టోక్యో: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్నారు. అక్కడి హిరోషిమాలో ఏర్పాటైన జీ7 సభ్య దేశాల అత్యున్నత స్థాయి సమ్మిట్‌లో ఆయన పాల్గొన్నారు. కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్‌కు ఇందులో సభ్యత్వం ఉంది. భారత్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా.. వంటి దేశాలు ప్రత్యేక ఆహ్వానితులుగా ఉన్నాయి.

తన పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ఆయా దేశాధినేతలు, ప్రధానమంత్రులతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతోనూ ముఖాముఖి సమావేశం అయ్యారు. రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ఆరంభమైన అనంతరం జెలెన్‌స్కీతో మోదీ భేటీ కావడం ఇదే తొలిసారి. ఐక్యరాజ్య సమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గ్యుటెర్రాస్‌నూ కలుసుకున్నారు. ఇండొనేషియా, వియత్నాం దేశాల ప్రధానులతో భేటీ అయ్యారు.

modi

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో ద్వైపాక్షిక సమావేశంలో మోదీ పాల్గొన్నారు. త్వరలో మోదీ చేపట్టబోయే ఫ్రాన్స్ పర్యటనకు సంబంధించిన అంశాలపై వారిద్దరూ చర్చించారు. భారత్-ఫ్రాన్స్ వ్యూహాత్మక భాగస్వామ్య పురోగతినీ సమీక్షించారు. వాణిజ్యం, సహకారం, రక్షణ.. వంటి రంగాలపై విస్తృతంగా చర్చించారు. ఆర్థికం, పౌర విమానయానం, పునరుత్పాదకత, తయారీ రంగాల్లో కలిసి పని చేయాలని నిర్ణయించారు.

అనంతరం క్వాడ్ సమావేశంలో మోదీ పాల్గొన్నారు. భారత్, జపాన్, అమెరికా, ఆస్ట్రేలియాలకు ఇందులో సభ్యత్వం ఉంది. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో నిర్వహించ తలపెట్టిన క్వాడ్ సమావేశం రద్దయింది. దీన్ని హిరోషిమాలోనే ఏర్పాటయింది. ఇందులో మోదీ, జో బైడెన్, ఫ్యుమియో కిషిద, ఆంథోనీ అల్బెనీస్ పాల్గొన్నారు. ఈ సమావేశాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించారు.

వచ్చే సంవత్సరం జరిగే క్వాడ్ అత్యున్నత సమావేశాన్ని భారత్‌లో నిర్వహిస్తామని ప్రకటించారు. దీనికి అవసరమైన చర్యలను ఇప్పటి నుంచే చేపడుతామని పేర్కొన్నారు. ఈ ఏడాది జీ20కి కూడా భారత్ ఆతిథ్యాన్ని ఇస్తోన్న విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఏడాది సెప్టెంబర్ 9, 10 తేదీల్లో భారత్‌లో జీ20 సమ్మిట్ ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. సమావేశం ముగిసిన అనంతరం క్వాడ్ భేటీలో చేసిన ఉమ్మడి తీర్మానాలపై మోదీ సంతకం చేశారు.

తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా.. దాన్ని అణచివేయాల్సిన అవసరం ఉందని క్వాడ్ నేతల జాయింట్ స్టేట్‌మెంట్ తెలిపింది. సరిహద్దు ఉగ్రవాదం, హింసాత్మక పరిస్థితులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించదలచుకోలేదని స్పష్టం చేసింది. ఉగ్రవాద నిర్మూలనలో అంతర్జాతీయ సహకారానికి కట్టుబడి ఉన్నామని, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఉగ్రవాదాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఉందని పేర్కొంది. వివిధ అంశాలపై ప్రాంతీయ భాగస్వామ్య దేశాలు కలిసి పని చేస్తాయని వివరించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+