వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మేమిద్దరం మాకిద్దరు అంటే కుదరదు - ఒక కుటుంబానికి ఒక్కరే ముద్దు..!!

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యధిక జనాభా గల దేశం ఏది? అనే ప్రశ్న ఎవ్వరిని అడిగినా- ఠక్కున వచ్చే సమాధానం.. చైనా. అత్యధిక జనాభా గల దేశంగా అగ్రస్థానంలో నిలిచిందీ డ్రాగన్ కంట్రీ. సుదీర్ఘకాలంగా టాప్ పొజీషన్‌లో ఉంటూ వస్తోంది. విస్తీర్ణంలో అతి పెద్ద దేశాల్లో ఒకటిగా ఉన్న చైనా.. జనాభాలోనూ అదే స్థాయిలో ఉంటోంది. అత్యధిక మానవ వనరులను కలిగిన దేశంగా గుర్తింపు పొందింది. దీనికి అనుగుణంగా పారిశ్రామికవృద్ధి రేటును నమోదు చేసింది.

126 నుంచి 141 కోట్లకు చైనా..

126 నుంచి 141 కోట్లకు చైనా..


గత ఏడాది రూపొందించిన నివేదికల ప్రకారం- చైనా జనాభా 141 కోట్ల 24 లక్షలు. 2000 సంవత్సరంలో 126 కోట్ల 26 లక్షలుగా చైనా జనాభా నమోదైంది. అక్కడి నుంచి జనాభా పెరుగుదలలో వేగం మందగించింది. జననాల రేటు తగ్గుతూ వచ్చిందక్కడ. ఒక కుటుంబానికి ఒకే బిడ్డ అనే విధానాన్ని తీసుకుని రావడం దీనికి ప్రధాన కారణమైంది. ఈ విధానాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తోంది చైనా ప్రభుత్వం. కుటుంబ నియంత్రణ మార్గదర్శకాలను కఠినంగా అమలు అయ్యేలా చేసింది.

భిన్నంగా భారత్..

భిన్నంగా భారత్..

జనాభాను నియంత్రించడానికి అక్కడి ప్రభుత్వం అనేక రకాల చర్యలను తీసుకుంటోంది. ఫలితంగా- ఈ 21 సంవత్సరాల వ్యవధిలో చైనాలో జనాభా పెరగుదల బాగా మందగించింది. 126.26 నుంచి 141.24 లక్షలకు చేరింది. అదే సమయంలో భారత్‌లో భారత విపరీతంగా పెరిగింది. 2000లో 105 కోట్ల 66 లక్షలుగా ఉన్న భారత్ జనసంఖ్య 2021 నాటికి 139 కోట్ల 34 లక్షలకు చేరింది. చైనాతో పోల్చుకుంటే ఈ 21 సంవత్సరాల వ్యవధిలో భారత జనాభా పెరుగుదల రెట్టింపు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

జనాభా పెరుగుదల వేగం..

జనాభా పెరుగుదల వేగం..


జనాభా పెరుగుదలలో ఏ మాత్రం వేగం మందగించలేదు. పైగా పెరిగింది కూడా. ఇదే వేగాన్ని ఇంకో ఏడాది పాటు కొనసాగిస్తే- జనసంఖ్యలో చైనాను అధిగమించగులుగుతుందనడంలో సందేహాలు అక్కర్లేదు. 2023 నాటికి ప్రపంచంలోనే అత్యధిక జనాభా గల దేశంగా భారత్ ఆవిర్భవించడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రపంచ జనాభా ప్రాస్పెక్టస్ 2022 ఈ విషయాన్ని స్పష్టం చేసింది. 2000 నుంచి 2021 మధ్యకాలంలో చైనాలో జన సంఖ్య సగానికి పైగా తగ్గిపోగా- అదే కాలానికి భారత్‌లో జనాభా పెరుగుదల వేగం రెట్టింపయిందని తెలిపింది.

అమెరికాతో..

అమెరికాతో..

ప్రస్తుతం భారత జనాభా 139 కోట్ల 34 లక్షలు. అమెరికాతో పోల్చుకుంటే నాలుగు రెట్లు ఎక్కువ. బ్రిటన్‌తో కంపేర్ చేసి చూస్తే- ఏకంగా 20 రెట్లు అధికం. భారత్‌లో ప్రతి రోజూ 85,000 కంటే ఎక్కువ మంది పిల్లలు పుడతున్నట్లు ప్రపంచ జనాభా ప్రాస్పెక్టస్ అంచనా వేసింది. చైనాలో ఒక్కరోజులో జన్మించే వారి సంఖ్య సగటున 49,400గా ఉంటోంది. భారత్ జన సంఖ్య పెరుగుదలలో ఇదే వేగాన్ని కొనసాగించితే 2023 నాటికి అగ్రదేశంగా ఆవిర్భవిస్తుంది. 2060 నాటికి 165 కోట్లకు చేరుతుంది.

భారత్‌తో పాటు

భారత్‌తో పాటు

మొత్తంగా ప్రపంచ జనాభా 800 కోట్ల మార్క్‌ను అధిగమించడానికి సిద్ధమైంది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఈజిప్ట్, ఇథియోపియా, నైజీరియా, పాకిస్తాన్, ఫిలిప్పీన్స్, యునైటెడ్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియాల్లో జనాభా శరవేగంగా పెరుగుతోన్నట్లు ఈ నివేదిక స్పష్టం చేసింది. 2050 నాటికి సబ్ సహారా ఆఫ్రికన్ దేశాల్లో జనాభా భారీగా పెరుగుతుందని, బాల్యావస్థలో మరణాల సంఖ్య అక్కడ భారీగా తగ్గడమే దీనికి కారణమనే అంచనాలు ఉన్నాయి.

English summary
As per the World Population Prospects 2022 report, India is projected to surpass China as the world's most populous country in 2023.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X