పాక్‌పై దాడి చేసేందుకు భారత ఆర్మీకి అన్ని అధికారాలు ఇచ్చాం: జైట్లీ
ఢిల్లీ: గురువారం భారత జవాన్లు ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై దాడులకు తెగబడ్డ జైషే మహ్మద్ పై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. ప్రధాని నేతృత్వంలో భద్రతపై హైలెవెల్ క్యాబినెట్ కమిటీ సమావేశం తర్వాత ఆయన మాట్లాడారు. దేశం కోసం అమరులైన జవాన్లకు రెండు నిమిషాలు మౌనం వహించామని చెప్పిన జైట్లీ దేశం కూడా రెండు నిమిషాలు మౌనం వహించాలని కోరారు.
ఇక అంతర్జాతీయ వేదికలపై పాకిస్తాన్ తీరును ఎండగడుతామని ఆ దేశాన్ని ఒంటరిని చేస్తామని వెల్లడించారు. ఎవరైతే పాకిస్తాన్‌కు నిధులు ఇస్తున్నారో అలాంటి దేశాలు నిధులు విడుదల చేయడం నిలిపివేయాలని కోరుతామన్నారు. ఈ బాధ్యతను కేంద్ర ఆర్థిక శాఖ తీసుకుంటుందని చెప్పారు. మరోవైపు విదేశీ వ్యవహారాల శాఖ కూడా అన్ని చర్యలు తీసుకుంటుందని జైట్లీ చెప్పారు.

గురువారం జరిగిన దాడి పాక్ కనుసన్నల్లోనే జరిగిందని స్పష్టమవుతోందని ఇందుకు సంబంధించిన అన్ని ఆధారాలు అంతర్జాతీయ వేదికలపై చూపిస్తామని జైట్లీ స్పష్టం చేశారు. దేశం కోసం ప్రాణాలు త్యాగం చేసిన జవాన్ల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని అదే సమయంలో దేశం కూడా అండగా నిలవాలని జైట్లీ పిలుపిచ్చారు.
ఇక భారత ఆర్మీకి అన్ని అనుమతులు ఇచ్చామని ఉగ్రమూకలను ఏరిపారేసేందుకు ముందుకెళ్లాల్సిందేనని సమావేశంలో చర్చించినట్లు చెప్పారు. ఆర్మీ సరైన సమయంలో గట్టి గుణపాఠం పాకిస్తాన్‌కు చెబుతుందని ఇందుకోసం ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహకారం ఉంటుందని సమావేశంలో చర్చించినట్లు వెల్లడించారు జైట్లీ. ఇక ఉగ్రవాదాన్ని ప్రోత్సహించేవారిని వదిలిపెట్టేది లేదని వెల్లడించారు అరుణ్ జైట్లీ.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications