• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

కరోనా వ్యాక్సిన్ తయారీపై నీలినీడలు .. ఇప్పట్లో కరోనా వ్యాక్సిన్ రానట్టేనా?

|

సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం (డిఎస్టి) పత్రికా ప్రకటనతో భారతదేశం యొక్క కోవిడ్ -19 వ్యాక్సిన్ తయారీపై కొత్త వివాదం చెలరేగింది. 2021కి ముందు సామూహిక వినియోగానికి సిద్ధం కానుంది అని ఐసీఎంఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇప్పట్లో కరోనా వ్యాక్సిన్ తయారు సాధ్యమయ్యేలా లేదని సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం మార్చడంతో కరోనా వ్యాక్సిన్ తయారీపై ఆసక్తికర చర్చ జరుగుతోంది.

కరోనా విషయంలో హైదరాబాద్ కంటే ఏపీ సేఫ్ జోనా ? ఏపీ తెలంగాణా బోర్డర్ లో ట్రాఫిక్ రద్దీతో చర్చ

కరోనా వ్యాక్సిన్ తయారీ సమయం విషయంలో గందరగోళం

కరోనా వ్యాక్సిన్ తయారీ సమయం విషయంలో గందరగోళం

కరోనా మహమ్మారితో ప్రపంచమే అతలాకుతలం అవుతున్న విషయం తెలిసిందే. అలాంటి కరోనా మహమ్మారి నుండి స్వాంతన కలిగించటానికి వ్యాక్సిన్ తయారీ లో బిజీగా ఉన్నాయి ప్రపంచ దేశాలు. అయితే ఇండియాలోనూ భారత్ బయోటెక్, జైడస్ సంస్థలు కరోనా వ్యాక్సిన్ తయారీ చివరి దశలో ఉన్నట్లు ప్రకటించాయి. మరోవైపు భారతీయ వైద్య ఆరోగ్య మండలి కూడా ఆగస్టు 15 నాటికి విడుదల చేస్తామని ప్రకటించింది. అయితే తాజాగా మరో ప్రకటనతో వివాదం నెలకొంది.

2021లోగా వ్యాక్సిన్ అందించటం సాధ్యం కాదన్న ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్

2021లోగా వ్యాక్సిన్ అందించటం సాధ్యం కాదన్న ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్

కోవిడ్ -19 కు వ్యతిరేకంగా కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి చేయడాన్ని ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ (ఐఎఎస్సి) ఆదివారం స్వాగతించింది, కాని దీనిని 2021లో గా అందించడం "అసాధ్యమైనది" అని పేర్కొంది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) ఆగస్టు 15 లోగా వ్యాక్సిన్ వస్తుందని చెప్తుండగా, ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ మాత్రం అది సాధ్యం కాదని పేర్కొంటుంది. బెంగళూరుకు చెందిన ఐఎఎస్సి ఒక ప్రకటన విడుదల చేసింది, దీనిలో ఆగస్టు 15, వరకు వ్యాక్సిన్ వస్తుందని చెబుతున్న కాలక్రమం సమంజసమైనది కాదని అంటోంది.

మూడు ఫేజ్ లుగా ట్రయల్స్ .. వ్యాక్సిన్ అందుబాటులోకి అప్పుడే కాదు

మూడు ఫేజ్ లుగా ట్రయల్స్ .. వ్యాక్సిన్ అందుబాటులోకి అప్పుడే కాదు

కరోనా వ్యాక్సిన్ త్వరగా ప్రజల ఉపయోగం కోసం అందుబాటులో రావాలని కోరుకుంటూనే ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ వ్యాక్సిన్ అభివృద్ధిలో నిమగ్నమైన అనేకమంది శాస్త్రవేత్తలతో సహా- ఐసీఎంఆర్ ప్రకటించిన సమయంలో వ్యాక్సిన్ అందించడం మాత్రం అసాధ్యమని అంటోంది. మానవులలో వాడటానికి వ్యాక్సిన్ అభివృద్ధికి దశలవారీగా శాస్త్రీయంగా అమలు చేయాల్సిన పరీక్షలు అవసరమని అకాడమీ తెలిపింది. ఈ ట్రయల్స్‌లో భద్రత (ఫేజ్ 1 ట్రయల్), వివిధ మోతాదు స్థాయిలలో సమర్థత మరియు దుష్ప్రభావాలు (ఫేజ్ 2 ట్రయల్), ప్రజల ఉపయోగం ముందు వేలాది మంది ఆరోగ్యకరమైన ప్రజలలో (ఫేజ్ 3 ట్రయల్) భద్రత మరియు సమర్థతను నిర్ధారించడం ఉంటాయను అది అంత తొందరగా ముగిసే ప్రక్రియ కాదని తేల్చింది .

కాల వ్యవధి చాలానే పడుతుంది.. 2021 లోపు వ్యాక్సిన్ తయారీ అసమంజసం

కాల వ్యవధి చాలానే పడుతుంది.. 2021 లోపు వ్యాక్సిన్ తయారీ అసమంజసం

వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ కోసం ఆరోగ్యకరమైన మానవ వాలంటీర్ల భాగస్వామ్యం అవసరం. అందువల్ల, ట్రయల్స్ సూచించడానికి ముందు అనేక నైతిక మరియు నియంత్రణ ఆమోదాలు పొందాలి. పరిపాలనా ఆమోదాలను వేగవంతం చేయగలిగినప్పటికీ, శాస్త్రీయ ప్రయోగం మరియు డేటా సేకరణ ప్రక్రియ సహజమైన కాల వ్యవధిని కలిగి ఉంది కాబట్టి వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం అంత త్వరగా సాధ్యం కాదని పేర్కొంది. ఐసీఎంఆర్ ప్రకటించిన సమయం అసమంజసమైనదని. ముందుచూపు లేనిదని ఈ ప్రకటనలో పేర్కొంది. శాస్త్రీయ ప్రమాణాలను పూర్తి స్థాయిలో నిర్ధారించకుండా వ్యాక్సిన్ ను విడుదల చేస్తే అది భారత పౌరుల ఆరోగ్యంపై తీవ్ర దుష్పరిణామాలను చూపిస్తుందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే కరోనా వ్యాక్సిన్ తయారీ విషయంలో నిర్దిష్టంగా సమయం చెప్పలేమని ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ పేర్కొంది.

వ్యాక్సిన్ తయారీపై నీలి నీడలు

వ్యాక్సిన్ తయారీపై నీలి నీడలు

అయితే ఇదే విషయాన్ని ప్రెస్ అకాడమీ బ్యూరో ప్రచురించిన కథనంలో కూడా పేర్కొంది.దీంతో ఇప్పుడు వ్యాక్సిన్ తయారీపై నీలినీడలు అలుముకున్నాయి కరోనా వ్యాక్సిన్ తయారీపై నీలినీడలు అలుముకున్నాయి. కరోనా వ్యాక్సిన్ తయారీ ఇప్పట్లో లేనట్టే అనే భావన కలుగుతోంది. 2021 నాటికి కరోనా వైరస్ కు ఇండియాలో వాక్సిన్ కనుగొనే అవకాశం ఉందని మొదట పేర్కొన్న ప్రెస్ అకాడమీ బ్యూరో కథనంలో కొద్దిసేపటికే పలు మార్పులు చేశారు. శాస్త్ర సాంకేతిక అభివృద్ధి శాఖ చేసిన ఆ మార్పుల ప్రకారం 2021 నాటికి కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశమే లేదని తెలుస్తుంది.

ఐసిఎంఆర్ ఒకలా ... ఐఎఎస్సి మరోలా .. వ్యాక్సిన్ ఇప్పట్లో కష్టమేనా !!

ఐసిఎంఆర్ ఒకలా ... ఐఎఎస్సి మరోలా .. వ్యాక్సిన్ ఇప్పట్లో కష్టమేనా !!

ఇప్పటికే జూలై 2 న ఒక లేఖలో, ఐసిఎంఆర్ డైరెక్టర్ జనరల్ బలరామ్ భార్గవ ఆగస్టు 15 లోగా కోవిడ్ -19 కు వ్యతిరేకంగా భారతదేశంలో మొట్టమొదటిగా స్థానికంగా తయారైన వ్యాక్సిన్‌ను ప్రవేశపెట్టాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని పేర్కొన్నారు. భారత్ బయోటెక్ యొక్క కోవాక్సిన్ కోసం క్లినికల్ ట్రయల్ ఫాస్ట్ ట్రాక్ ప్రక్రియలకు ప్రారంభించిందని తెలిపారు. ఇక ఈ నేపథ్యంలో తాజాగా కాలపరిమితిని ప్రకటించకుండా కథనంలో మార్పులు చేయడం , ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ చెప్పిన సమయంలో వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవచ్చు అని పేర్కొనటంతో కరోనా వ్యాక్సిన్ ఇప్పట్లో లేనట్టేనా అన్న భావన కలుగుతుంది.

English summary
The Indian Academy of Sciences (IASc) on Sunday welcomed the development of a candidate vaccine against Covid-19, but called the timeline issued by the Indian Council of Medical Research (ICMR) to launch it "unfeasible".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more