వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Indian Air Force Day 2020: : మోడీ, రాజ్‌నాథ్ విషెస్.. రాఫెల్ చేరికతో మరింత బలంగా..

|
Google Oneindia TeluguNews

భారత వాయుసేన ఆవిర్భవించి నేటికి 88 ఏళ్లు అవుతున్నాయి. యానివర్సరీ సందర్భంగా యుద్ధ విమానాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రదర్శిస్తోంది. ఈసారి మాత్రం రాఫెల్ యుద్ధ విమానాలు వాయుసేనలో చేరాయి. ఢిల్లీ సమీపం హిందన్ వద్ద గల వైమానిక దళం స్టేషన్‌లో స్వాగత కార్యక్రమం జరుగుతోంది.

మోడీ విషెస్..

మోడీ విషెస్..

ఎయిర్ ఫోర్స్ డే సందర్భంగా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వారియర్స్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన హిందీలో ట్వీట్ చేశారు. వైమానిక దళ యోధులందరికీ అభినందనలు అంటూ ట్వీట్ ప్రారంభించారు. గగనతలం నుంచి దేశాన్ని సురక్షితంగా రక్షించేందుకు శ్రమిస్తున్నారని కొనియాడారు. ఇదేకాకుండా విపత్తులు సంభవించిన సమయంలో మానవత్వంతో వ్యవహారిస్తే అంకితభావంతో శైర్యాన్ని ప్రదర్శిస్తూ ధైర్యంగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. మీరు అందిస్తోన్న సేవలు ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని మోడీ ప్రస్తావించారు.

 రాజ్‌నాథ్ శుభాకాంక్షలు..

రాజ్‌నాథ్ శుభాకాంక్షలు..

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సిబ్బంది తమ సత్తా చాటుతున్నారని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. సవాళ్లను ఎదుర్కొంటూ.. శత్రువులపై ఓ కన్నేసి ఉంచుతున్నారని పేర్కొన్నారు. వాయుసేన సిబ్బందికి అభినందనలు తెలిపారు. వాయుసేనలో పనిచేసే ప్రతీ ఒక్కరికీ.. పురుషులు/ మహిళ సిబ్బందిని ఆయన ప్రశంసించారు.

Recommended Video

Watch: Russia 75th Victory Day Parade At Moscow : రక్షణ రంగంలో కీలక ఒప్పందాలు...!! | Oneindia Telugu
 రాఫెల్ చేరికతో..

రాఫెల్ చేరికతో..

సెప్టెంబర్ 10వ తేదీన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు భారత వాయుసేనలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో భారత వాయుసేన మరింత పటిష్టంగా మారింది. తూర్పు లడాఖ్ వద్ద చైనాతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న క్రమంలో ఎయిర్ ఫోర్స్‌లోకి రాఫెల్ విమానాలు చేరడం బలాన్ని చేకూర్చింది. ఇటు హిందన్ ఎయిర్ బేస్ వద్ద తేజస్ ఎల్‌సీఏ, జాగ్వార్, మిగ్29, మిగ్ 21, సుఖోయ్ 30 విమానాలు రిహార్సల్స్ చేశాయి. ఇందులో రాఫెల్ ఆకర్షణగా నిలిచింది.

English summary
Indian Air Force Day 2020: Indian Air Force is celebrating its 88th anniversary today when it will showcase it prowess and put its mainstream fighter jets on display.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X