వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆ ఎగిరే శవపేటికల్ని ఎయిర్ ఫోర్స్ వదిలించుకుంటుందా ? ఐదేళ్లలో మిగ్ లన్నీ అవుట్ ?

|
Google Oneindia TeluguNews

రాజస్తాన్ లోని బార్మర్ లో తాజాగా మిగ్ -21 స్వాడ్రన్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో పైలట్, కోపైలట్ చనిపోయారు. దీంతో మిగ్-21ల పనితీరుపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. గతంలో జార్జ్ ఫెడ్నాండెజ్ వంటి దిగ్గజ నేతలు వీటిని ఎగిరే శవపేటికలుగా అభివర్ణించారు. ఇప్పుడు తాజా ప్రమాదంతో మరోసారి అలాంటి చర్చే జరుగుతోంది.

భారతీయ వైమానిక దళం (IAF) మిగిలిన నాలుగు MiG-21 ఫైటర్ స్క్వాడ్రన్‌లను దశలవారీగా తొలగించడానికి మూడేళ్ల గడువు పెట్టుకుంది. వాటిలో ఒకటి సెప్టెంబర్‌లో తన సేవల్ని విరమించుకోనుంది. అలాగే వచ్చే ఐదేళ్లలో మిగ్-29 యుద్ధ విమానాల మూడు స్క్వాడ్రన్‌లను దశలవారీగా తొలగించాలని వాయుసేన యోచిస్తోంది. అదే సమయంలో సోవియట్ కు చెందిన ఈ విమానాల సిరీస్ ను పూర్తిగా దశలవారీగా తొలగించే ప్రణాళిక వాయుసేన డ్రైవ్ లో భాగంగా ఉందని తెలుస్తోంది. మొన్న రాత్రి రాజస్థాన్‌లోని బార్మర్‌లో MiG-21 జెట్ తాజా క్రాష్‌తో దీనికి సంబంధం లేదని కేంద్రం చెబుతోంది.

ఈ ప్రమాదంలో వింగ్ కమాండర్ ఎం. రాణా, ఫ్లైట్ లెఫ్టినెంట్ అద్వితీయ బాల్, జెట్ ఇద్దరు పైలట్లు చనిపోయారు. దీంతో ఈ వృద్ధ విమానాలపై మరోసారి అందరి దృష్టి పడేలా చేసింది. 2025 నాటికి మొత్తం నాలుగు MiG-21 స్క్వాడ్రన్‌లను రిటైర్ చేయాలనేది వాయుసేన ఆలోచన. శ్రీనగర్ ఆధారిత No 51 స్క్వాడ్రన్ సెప్టెంబర్ 30న నంబర్-ప్లేటింగ్ చేస్తారు. నంబర్ ప్లేటింగ్ అనేది సాధారణంగా 17-20 విమానాలను కలిగి ఉండే స్క్వాడ్రన్ రిటైర్మెంట్‌ను సూచిస్తుంది. 1999లో కార్గిల్ యుద్ధ సమయంలో 'ఆపరేషన్ సఫేద్ సాగర్'లో భాగంగా 'స్వార్డ్‌ఆర్మ్స్' అని కూడా పిలిచే స్క్వాడ్రన్ .. అలాగే ఫిబ్రవరి 27, 2019న బాలాకోట్‌లో భారతదేశం వైమానిక దాడి చేసిన ఒక రోజు తర్వాత, పాకిస్తాన్ ప్రతీకార చర్యను తిప్పికొట్టేందుకు వాడారు.

indian air force to phase out remaining four MiG-21 squadrons by 2025 due to accidents

నంబర్ 51 స్క్వాడ్రన్‌కు చెందిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్ వైమానిక పోరాటంలో శత్రు జెట్‌ను కూల్చివేశాడు. ఆ తర్వాత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ చేతుల మీదుగా వీరచక్ర అవార్డును అందుకున్నారు. వర్థమాన్ ఇప్పుడు గ్రూప్ కెప్టెన్ గా ఉన్నారు. ప్రస్తుతం, IAF వద్ద దాదాపు 70 మిగ్-21 విమానాలు మరియు 50 మిగ్-29 వేరియంట్‌లు ఉన్నాయి. MiG-21 లు చాలా కాలం పాటు వాయుసేనకు ప్రధాన ఆధారంగా ఉన్నాయి. అయితే, ఈ విమానాలకు చాలా పేలవమైన భద్రతా రికార్డు ఉంది. మిగ్ వేరియంట్ మొదటి ఫ్లీట్ 1963లో వాయుసేనలోకి ప్రవేశించింది.

అనంతరం భారత్ 700 మిగ్-వేరియంట్‌లను కొనుగోలు చేసింది. వాయుసేన తన కాలం చెల్లిన యుద్ధ విమానాలను భర్తీ చేయడంలో సాయం కోసం 83 తేజస్ యుద్ధ విమానాల కొనుగోలు కోసం హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL)తో ఒప్పందం చేసుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖ గత ఏడాది ఫిబ్రవరిలో చేసుకున్న ఈ 48వేల కోట్ల ఒప్పందాన్ని ఐఏఎఫ్ రూపు రేఖల్ని మార్చబోతోంది.

English summary
indian airforce to phaseout remaining mig-21 squadrons by 2025 in wake of recent accident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X