ప్రతీకారం: భారత ఆర్మీ కాల్పులు, ముగ్గురు పాక్ జవాన్లు హతం
న్యూఢిల్లీ: భారత సైనికులు నియంత్రణ రేఖను దాటి ముగ్గురు పాకిస్తాన్ సైనికులను హతమార్చారు. శనివారంనాడు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ సైనికులు జరిపిన కాల్పుల్లో నలుగురు భారత సైనికలు మరణించారు.
పాకిస్తాన్ చర్యకు ప్రతీకారంగానే సోమవారంనాడు భారత సైనికులు నియంత్రణ రేఖను (ఎల్ఓసిని) దాటి దాడికి దిగినట్లు తెలుస్తోంది. భారత సైనికులు జరిపిన కాల్పుల్లో ఓ పాకిస్తాన్ సైనికుడు గాయపడ్డాడు.

ఈ నెల 23వ తేదీన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్ జరిపిన కాల్పుల్లో ఓ మేజర్‌తో పాటు నలుగురు భారత సైనికులు మరణించారు. మరణించిన అధికారిని 32 ఏల్ల మేజర్ మోహర్కర్ ప్రఫుల్లా అంబదాస్‌గా గుర్తించారు.












Click it and Unblock the Notifications