భారత సైన్యంలో మరో 147 మంది మహిళా అధికారులకు పర్మినెంట్ కమిషన్ హోదా

న్యూఢిల్లీ: భారత సైన్యంలో మరో 147 మంది మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హోదా లభించింది. దీంతో ఈ హోదా దక్కిన మహిళా అధికారుల సంఖ్య 424కు చేరింది. ఈ మేరకు భారత సైన్యం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.

పలు కారణాల వల్ల కొద్ది మంది మహిళా అధికారుల ఫలితాలు నిలిపివేసినట్లు ఇండియన్ ఆర్మీ పేర్కొంది. సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించి తుది తీర్పు కోసం కూడా వేచి చూస్తున్నట్లు వెల్లడించింది.

Indian Army Grants Permanent Commission To 147 additional Women SSC Officers.

సర్వీసుతో సంబంధం లేకుండా మహిళా అధికారులకు శాశ్వత కమిషన్ హోదా ఇవ్వాలంటూ 2020, ఫిబ్రవరి 17న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియన్ ఆర్మీ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో, మహిళా అధికారులను పరీక్షించడానికి సైన్యం 2020 సెప్టెంబర్‌లో ప్రత్యేక ఎంపిక బోర్డును ఏర్పాటు చేసింది. 2020 నవంబర్‌లో ఫలితాలు ప్రకటించబడ్డాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+