సముద్రపు దొంగల అటాక్.. ఇండియన్ కార్గో షిప్ హైజాక్
భారతదేశానికి చెందిన ఓ కార్గో షిప్ ను రెండ్రోజుల క్రితం సోమాలియా సముద్రపు దొంగలు(పైరేట్స్) హైజాక్ చేశారు.
న్యూఢిల్లీ: భారతదేశానికి చెందిన ఓ కార్గో షిప్ ను సోమాలియా సముద్రపు దొంగలు(పైరేట్స్) హైజాక్ చేశారు. ఏప్రిల్ 1న ఈ షిప్ హైజాక్ కు గురైనట్లు అధికారులు నిర్ధారించారు. హైజాక్ కు గురైన సమయంలో షిప్ లో 11 మంది సిబ్బంది ఉన్నారు.
ఈ షిప్ దుబాయ్ నుంచి యెమెన్ వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం సోమాలియా సముద్రపు దొంగల చేతిలో బందీలుగా ఉన్న 11 మంది సిబ్బంది ముంబైలోని మాండ్వీ ప్రాంతానికి చెందిన వారని తెలుస్తోంది.

షిప్ హైజాక్ కు గురైన విషయాన్ని షిప్ కెప్టెన్ దుబాయ్ లోని అధికారులకు సమాచారం అందించడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కార్గో షిప్ హైజాక్ అయిందన్న సమాచారం అందగానే కలకలం రేగింది.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా ఈ షిప్ హైజాక్ ఘటనను ధ్రువీకరించింది. షిప్ లోని సిబ్బందిని రక్షించేందుకు అవసరమైన అన్న రకాల చర్యలూ చేపడుతున్నట్లు భారత నౌకాదళ అధికారులు వెల్లడించారు.
-
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల.. -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!!












Click it and Unblock the Notifications