ఫైజర్, మోడెర్నా కన్నా.. కోవిషీల్డ్ బెటర్: అదర్ పూనావాలా
కరోనా మహమ్మరిని వ్యాక్సిన్ నియంత్రించగలిగాయి. దేశీయ వ్యాక్సిన్ కోవిషీల్డ్, కోవాక్సిన్.. దేశంలో జనాలు దాదాపుగా అందరు తీసుకున్నారు. రెండు డోసులు పూర్తయ్యాయి. మరికొందరు బూస్టర్ డోసు కూడా తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్ల గురించి సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అధర్ పూనావాలా మాట్లాడారు.
దేశంలో రూపొందిన వ్యాక్సిన్లు శక్తివంతమైనవని పూనావాలా తెలిపారు. ఇవీ ఫైజర్, మోడెర్నా కన్నా ప్రొటెక్ట్ చేశాయని వివరించారు. ఆ రెండు వ్యాక్సిన్లు ఇండియాలోకి రాలేదు. అమెరికా లాంటి దేశాలు రెండు, బూస్టర్ డోసులు వాటినే తీసుకున్నారు. అయితే అక్కడ ఇప్పటికీ వైరస్ బారిన పడుతున్నారని పూనావాలా తెలిపారు. భారతదేశంలో మాత్రం అలాంటి పరిస్థితి లేదని చెప్పారు. దేశంలో తయారైన వ్యాక్సిన్లు మంచిగా పనిచేస్తున్నాయని పేర్కొన్నారు.

కోవిషిల్డ్ వ్యాక్సిన్ దేశంతోపాటు 80 దేశాలకు ఎగుమతి చేశారు. 10 కోట్ల డోసులు పంపిణీ చేశామని వివరించారు. అయితే ఇప్పుడు వ్యాక్సిన్ డిమాండ్ తగ్గిందని చెప్పారు. కేసులు లేకపోవడంతో.. అంతగా లేదని చెప్పారు. దీంతో కోవిడ్ వ్యాక్సిన్ ధరను కూడా రూ.600 నుంచి రూ.225కి తగ్గించారు. ఈ నెల 10వ తేదీ నుంచి అన్ని ప్రైవేట్ ఆస్పత్రుల్లో 18 ఏళ్ల పైగా వారికి వ్యాక్సిన్ తీసుకునే వెసులుబాటు ఉంది.
ఇప్పుడు దేశంలో కరోనా వైరస్ తక్కువగానే ఉంది. కొత్త వేరియంట్ కూడా ముంబైలో వచ్చింది.. కానీ దాని ప్రభావం ఏమీ లేనట్టే ఉంది. దాదాపు అందరూ రెండు డోసులు తీసుకున్నారు. కొందరు బూస్టర్ డోసు తీసుకున్నారు. కరోనాకు దాదాపు చెక్ పడినట్టేనని అంటున్నారు. కానీ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.












Click it and Unblock the Notifications