గుడ్ న్యూస్ చెప్పిన అమలా పాల్.. ప్రెగ్నెన్సీ ఫోటోలు వైరల్..!!
స్టార్ హీరోలు, హీరోయిన్లు ఊరికే అవరూ.. ఎన్నో పాత్రలు మరెన్నో సినిమాలు చేస్తేనే ఆ స్థాయికి చేరుకుంటారు. అయితే సెలబ్రిటీల జీవితం తెరిచిన పుస్తకం లాంటిదే. వాళ్లకు సంబంధించిన ఏ చిన్న ఫోటో అయినా క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక తమ అభిమాన హీరో లేదా హీరోయిన్ కు సంబంధించిన ప్రతి చిన్న విషయం అయినా తెలుసుకునేందుకు అభిమానులు తెగ ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. సెలబ్రిటీస్ కూడా తమకు సంబంధించిన చిన్న విషయం అయినా తమ అభిమానులతో పంచుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే తమ లైఫ్ లోని చిన్న చిన్న మూమెంట్స్ నూ కూడా ఇన్ స్టా, ఫేస్ బుక్ లో పోస్టు చేసి ఫ్యాన్స్ ను సంబరపరుస్తుంటారు.

అయితే ఇటీవల కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ తండ్రి అయిన విషయం తెలిసిందే. అలాగే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె మరోసారి తల్లి కాబోతున్నట్లు ఈ విషయాన్ని తన అభిమానులతో పంచుకుంది. ఇక తాజాగా స్టార్ హీరోయిన్ అమలా పాల్ గుడ్ న్యూస్ చెప్పింది. తమ ఇంట్లోకి త్వరలోనే క్రైమ్ ఇన్ పార్ట్ నర్ రాబోతున్నాడంటూ ఇన్ స్టా లో ఓ క్యూట్ వీడియోను షేర్ చేసింది అమలా పాల్. తన సోదరుడు అభిజిత్ పాల్ త్వరలో తండ్రి కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు తన కుమారుడికోసం పార్ట్ నర్ ఇన్ క్రైమ్ రాబోతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం ఈ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
" మా ఇంట్లో మరో చిన్న గుండె శబ్దం త్వరలో వినిపించబోతోంది. ఇలై తన చిన్న క్రైమ్ పార్ట్ నర్ కోసం ఆగలేకపోతున్నాడు. కాబోయే నూతన తల్లిదండ్రులకు నా శుభాకాంక్షలు" అని అమలా పాల్ పోస్టు పెట్టింది. ఈ మేరకు ఫ్యాన్స్ కంగ్రాట్స్ చెబుతూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక అమలా పాల్ తెలుగులో ఇద్దరమ్మాయిలతో, నాయక్, జెండాపై కపిరాజు తదితర సినిమాలతో ఆరంగేట్రం చేసింది. అటు తమిళం, మలయాళంలోనూ పలు హిట్ చిత్రాల్లో నటించింది. ఇక అమలా పాల్ సోదరుడు అభిజిత్ పాల్ కూడా ఇటీవల సినిమాల్లోకి అడుగుపెట్టాడు. తమిళం, మలయాళంలో పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు.












Click it and Unblock the Notifications