ప్రభాస్ "కల్కి - 2" లో కోలీవుడ్ స్టార్.. ఏం ప్లాన్ చేశావ్ 'నాగ్' అన్న !!

గ్లోబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం " కల్కి". నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. అమితాబ్ ముఖ్య పాత్రలో నటించగా.. దీపికా పదుకునే హీరోయిన్ గా చేసింది. ఈ చిత్రానికి నిర్మాతగా అశ్వనీదత్ వ్యవహరించారు. భారతీయ బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించి.. ఇండియన్ సినీ చరిత్రలో ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ముఖ్యంగా క్లైమాక్స్‌లో భైరవ పాత్రను కర్ణుడితో లింక్ చేయడం ప్రేక్షకులకు షాక్ ఇచ్చింది. మూవీ భారీ విజయం సాధించడంతో ఇప్పుడు అందరి దృష్టి సీక్వెల్ "కల్కి 2" మీదే ఉంది.

మరోవైపు దీపిక పదుకొణె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నట్టు గతేడాది అధికారికంగా ప్రకటించారు. దాంతో అప్పటి నుంచి ఆమె స్థానంలో నటించేది ఎవరని జోరుగా చర్చ నడుస్తోంది. మేకర్స్ ఇప్పుడు ఆ పాత్ర కోసం సాయి పల్లవిని సంప్రదించారని టాక్ వినిపిస్తోంది. కాగా ఇప్పటికే సాయి పల్లవికి సంబంధించిన లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని.. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. ఈ సీక్వెల్‌కు "కర్ణ: 3102 బీసీ" అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

prabhas-kalki-2-movie-is-became-talk-of-the-town-that-kollywood-star-simbu-going-to-play-key-role

ఇక రానున్న రెండో భాగంలో మైథాలజీ, సైన్స్ ఫిక్షన్ కలయికగా స్టోరీ మరింత డెప్త్ కి వెళ్తుందని అంచనా వేస్తున్నారు. అలానే మొదటి భాగంలో మెరిసిన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ పాత్రలు ఈసారి మరింత బలంగా కనిపించనున్నాయి. వీరి మధ్య కీలక యాక్షన్ సన్నివేశాలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటితో పాటు కోలీవుడ్ స్టార్ హీరో కూడా ముఖ్య పాత్ర చేయనున్నారని సినీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

సర్‌ప్రైజ్ క్యాస్టింగ్..

అయితే 'కల్కి 2'లో ఒక పవర్‌ఫుల్ స్పెషల్ రోల్ కోసం తమిళ స్టార్ శింబును సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇది నిజమైతే సినిమా పాన్ ఇండియా స్థాయిని మరింత పెంచే అంశంగా మారుతుంది. తమిళ మార్కెట్‌లో కూడా ఈ సినిమా ప్రభావం మరింత విస్తరించే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ కోసం హైదరాబాద్‌లో భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోందని సమాచారం. భవిష్యత్ నగరాలు, యుద్ధ భూములు, హైటెక్ ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఆర్ట్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేకంగా పనిచేస్తోందని అంటున్నారు. విజువల్ ఎఫెక్ట్స్ ఈసారి మరింత ఉన్నత స్థాయిలో ఉండనున్నాయని టాక్ వినిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+