గుజరాత్ తీరంలో మత్సకారుడి హత్య-కేంద్రం సీరియస్- 10 మంది పాకిస్తాన్ నేవీ సిబ్బందిపై కేసు

గుజరాత్ లోని అరేబియా సముద్ర తీరంలో భారత్-పాకిస్తాన్ మధ్య ఉన్న అంతర్జాతీయ సరిహద్దు వద్ద మన మత్సకారుడిని పాకిస్తాన్ నేవీ సిబ్బంది తాజాగా కాల్పులు జరిపి పొట్టనపెట్టుకున్నారు. దీనిపై తీవ్ర దుమారం రేగుతోంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ప్రభుత్వం పది మంది పాకిస్తాన్ నేవీ సిబ్బందిపై కేసు నమోదు చేసింది.

గుజరాత్ తీరంలోని అరేబియా సముద్రంలో భారతీయ మత్సకారుడిపై కాల్పులు జరిపి హత్య చేసిన ఘటనలో పాకిస్తాన్ మారిటైమ్ సెక్యూరిటీ ఏజెన్సీకి చెందిన పది మంది సిబ్బందిపై కేసు నమోదైంది. గుజరాత్ కు చెందిన పోర్ బందర్ పోలీసులు ఈ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నవంబర్ 7వ తేదీన మహారాష్ట్రలోని థానేకు చెందిన శ్రీధర్ రమేష్ చామ్రే అనే మత్సకారుడు జల్పారీ అనే బోటులో ఇతర మత్సకారులతో కలిసి వెళ్తుండగా.. పాకిస్తాన్ నేవీ సిబ్బంది కాల్పులు జరిపారు. ఇందులో శ్రీధర్ చనిపోయాడు. దీంతో దిలీప్ నాటూ సోలంకి అనే గాయపడిన మరో మత్సకారుడి ఫిర్యాదు ఆధారంగా పాకిస్తాన్ నేవీ సిబ్బందిపై కేసు నమోదు చేసారు.

indian fisherman killing : gujarat police case against 10 pakistan navy personnel

శనివారం జరిగిన ఈ ఘటనలో ఒకరు చనిపోగా.. మరొకరు గాయపడ్డారని భారత కోస్ట్ గార్డ్ వర్గాలు ధృవీకరించాయి. ప్రస్తుతం బోటులో ప్రయాణించిన వారిని విచారించి, వారు అందించిన సమాచారం ఆధారంగా కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంపై సీరియస్ అయిన కేంద్రం... పాకిస్తాన్ దృష్టికి దౌత్య మార్గాల ద్వారా దీనిపై ఫిర్యాదు చేయాలని నిర్ణయించింది. అంతర్జాతీయ సముద్ర చట్టాలకు వ్యతిరేకంగా ఎలాంటి రెచ్చగొట్టే చర్యలు లేకుండానే పాకిస్తాన్ నేవీ ఏకపక్షంగా కాల్పులు జరిపిందని భారత్ ఆరోపిస్తోంది.య దీంతో ఈ వ్యవహారం ఇరుదేశాల మధ్య మరో చిచ్చు రేపేలా కనిపిస్తోంది.

indian fisherman killing : gujarat police case against 10 pakistan navy personnel

అయితే పాకిస్తాన్ మాత్రం ఈ బోటు తమ జలాల్లోకి అక్రమంగా ప్రవేశించడం వల్లే కాల్పులు జరపాల్సి వచ్చిందని తెలిపింది. తాము ఎన్ని హెచ్చరికుల చేసిన భారతీయ బోటు మాత్రం వాటిని పట్టించుకోకుండా తమ జలాల్లోకి దూసుకొచ్చిందని పాకిస్తాన్ వెల్లడించింది. దీన్ని భారత్ ఖండిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+