Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత హాకీ జట్టుకు పూర్వ వైభవం: ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ వల్లే ఇది సాధ్యమైంది

హాకీ భారతదేశపు జాతీయ క్రీడ. ఈ విషయం చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లోనే చదివాం. అయితే ప్రస్తుతం దేశంలో ఫుట్‌బాల్ లేదా క్రికెట్‌కు ఉన్న ఆదరాభిమానాలు హాకీకు దక్కడం లేదు. హాకీ క్రీడ ఒకప్పుడు భారత్‌లో అత్యంత ప్రాచుర్యం పొందిన ఆటగా గుర్తింపు ఉంది. కానీ కాలక్రమంలో హాకీ అంటేనే మరుగున పడే స్థితికి చేరుకుంది.

 భారత హాకీకి మంచి రోజులు

భారత హాకీకి మంచి రోజులు

భారత హాకీకి మళ్లీ తిరిగి మంచి రోజులు వచ్చాయి. ఇందుకు కారణం ప్రస్తుతం జరుగుతున్న టోక్యో ఒలింపిక్స్‌లో 41 సంవత్సరాల తర్వాత పురుషుల హాకీ జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంది. మహిళల హాకీ జట్టు కూడా చరిత్రలో తొలిసారిగా సెమీ ఫైనల్‌కు చేరి రికార్డు సృష్టించింది. ఇటు పురుషులు అటు మహిళల హాకీ జట్ల ప్రదర్శన చూసి అంతా ఆశ్చర్యపోయారు. అయితే భారత హాకీ జట్టు మళ్లీ ఈ స్థాయిలో తిరిగి పుంజుకుందంటే దానికి కారణం ఎవరో ఎవరి నాయకత్వంలో పూర్వ వైభవం సంతరించుకుందో తెలుసుకోవాలి.

 నవీన్ పట్నాయక్ ప్రభుత్వం వల్లే..

నవీన్ పట్నాయక్ ప్రభుత్వం వల్లే..


భారత దేశంలో హాకీ క్రీడకు తిరిగి పూర్వవైభవంను తీసుకురావడంలో ఒడిషా ప్రభుత్వం కీలకంగా వ్యవహరించింది. అవును సీఎం నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని ఒడిషా ప్రభుత్వం హాకీ క్రీడను పునరుద్దరించింది. నవీన్ పట్నాయక్ స్వతహాగా హాకీ క్రీడాకారుడు. తను గోల్‌కీపర్‌గా ఉన్నారు. అంతేకాదు క్రీడారంగం అంటే ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఉన్నవారు నవీన్ పట్నాయక్. అందుకే భారత హాకీని స్పాన్సర్ చేసేందుకు ముందుకొచ్చింది నవీన్ పట్నాయక్ ప్రభుత్వం.

2018 నుంచే స్పాన్సరర్‌గా..

2018 నుంచే స్పాన్సరర్‌గా..

2018వ సంవత్సరంలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం హాకీని స్పాన్సర్ చేయాలని నిర్ణయం తీసుకుంది. అప్పుడే జాతీయ జట్టు స్పాన్సర్లు ఉపసంహరించుకున్నారు. దేశమంతా గ్లామర్ క్రీడలను అనుసరిస్తున్న సమయంలో నవీన్ పట్నాయక్ హాకీని స్పాన్సర్ చేయాలనే సంచలన నిర్ణయం తీసుకున్నారు. హాకీకి కేవలం ఆర్థికంగా మాత్రమే సహాయం చేయలేదు.. మౌలిక సదుపాయాలు కూడా అందిచింది నవీన్ పట్నాయక్ ప్రభుత్వం.రాష్ట్రంలో హాకీకి ప్రాధాన్యతను ఇస్తూ అట్టడుగు వర్గాల వారిని కూడా ప్రోత్సహించడం జరిగింది.

 చివరిసారిగా 1980లో స్వర్ణం

చివరిసారిగా 1980లో స్వర్ణం

ఒలింపిక్స్‌లో భాగంగా హాకీ క్రీడలో భారత్ 8 బంగారు పతకాలు సాధించిందనే వాస్తవం కాస్త ఆశ్చర్యంగా అనిపించొచ్చు. 1928 ఒలింపింక్స్ నుంచి భారత్ హాకీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ వచ్చింది. భారత హాకీ జట్టు చివరిసారిగా 1980లో స్వర్ణం సాధించింది. అయితే రాబోయే రోజుల్లో మాత్రం భారత హాకీ జట్టు అద్భుతమైన విజయాలను సాధిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్రమంలోనే భారత హాకీ జట్టు పూర్వవైభవం తీసుకురావడంలో నవీన్ పట్నాయక్ పాత్ర వర్ణించలేనిది అవుతుంది.

ఒడిషా తమకు రెండో ఇల్లు

ఒడిషా తమకు రెండో ఇల్లు

కేరళకు చెందిన భారత హాకీ ఆటగాడు పీఆర్ శ్రీజేష్ జట్టులో కీలకంగా ఉన్నాడు. భారత జట్టుకు గతంలో నాయకత్వం కూడా వహించాడు. ఒడిషా తమకు రెండవ ఇల్లు అని టోక్యో ఒలింపిక్స్‌కు ముందు శ్రీజేష్ వ్యాఖ్యానించాడు. భారత హాకీకి ఒడిషా ప్రభుత్వం అందిస్తోన్న సహాయసహకారాలపై ప్రశంసలు కురిపించాడు శ్రీజేష్. భారత హాకీకి అందించిన సేవలకుగాను భారత ప్రభుత్వం పద్మశ్రీతో గౌరవించింది. ఒడిషా స్పోర్ట్స్ హబ్‌గా ప్రపంచానికి తెలుసని శ్రీజేష్ చెప్పారు. ఒడిషాలో శిక్షణ పొందుతున్నప్పుడు తమకు రెండవ ఇల్లుగా అనిపించిందని గుర్తుచేసుకున్నాడు శ్రీజేష్. ఒడిషాలో పిల్లలు ఐఏఎస్ లేదా ఒక ప్రభుత్వ అధికారి కావాలనుకోవడం లేదని.. చాలామంది ఒక అథ్లెట్ కావాలని కోరుకుంటున్నారని చెప్పారు.

 పతక విజేతలకు రూ. 6 కోట్లు

పతక విజేతలకు రూ. 6 కోట్లు

ఒలింపిక్ పతక విజేతలకు ఒడిషా రూ.6 కోట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఒడిషా ప్రభుత్వం ఆ రాష్ట్రంలో 14 ఆస్ట్రాటర్ఫ్‌లను అభివృద్ధి చేస్తోంది. 2018 లో జాతీయ హాకీ జట్టుకు అధికారిక స్పాన్సర్‌గా మారిన తర్వాత, ఆల్ ఇండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ ఒడిశా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఒడిశా తర్వాత జాతీయ జట్టు శిబిరాలు, ఐ-లీగ్ టోర్నమెంట్లు మరియు అంతర్జాతీయ టోర్నమెంట్‌లకు ఆతిథ్యం ఇచ్చింది. అదే సంవత్సరంలో, భువనేశ్వర్ ‌లో అంతర్జాతీయ హాకీ సమాఖ్య యొక్క ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చింది. హాకీ స్టేడియం అభిమానులతో సందడిగా మారిందని శ్రీజేష్ తన అనుభవాన్ని పంచుకున్నాడు.

ఆస్ట్రేలియాను మట్టికరిపించిన మహిళలు

ఆస్ట్రేలియాను మట్టికరిపించిన మహిళలు

ఒలింపిక్స్ క్వార్టర్ ఫైనల్స్‌లో భారత మహిళా జట్టు ప్రపంచ నెంబర్ 2 ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. మ్యాచ్ తర్వాత కోచ్ తన స్పందనను తెలిపారు. కలలు నిజమవుతాయని ఈ మ్యాచ్ నిరూపించిందని కోచ్ తెలిపారు. అంతేకాదు మనపై మనకు విశ్వాసం ఉండి అందుకు పట్టుదలను జోడిస్తే విజయం గ్యారెంటీ అని చెప్పారు. ఇందుకు నిదర్శనం మహిళల హాకీ జట్టు బలోపేతమైన ఆస్ట్రేలియాను ఓడించడమే అని చెప్పుకొచ్చారు.

ఇలాంటి విజయాలు అవసరం

ఇలాంటి విజయాలు అవసరం

భారత హాకీ ఇలాంటి విజయాలే నమోదు చేయాలని ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ కోరుకున్నారు. మసకబారిన కీర్తిని భారత హాకీ క్రీడాకారులు తిరిగి నిలుపుతారనే విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇలాంటి వేగాన్ని విజయాలను కొనసాగించాలని నవీన్ పట్నాయక్ భారత హాకీ పురుషులు మరియు మహిళల జట్టుకు శుభాకాంక్షలు తెలిపారు. ఇక భారత హాకీ జట్టు నమోదు చేసిన మెరుపు విజయాల గురించి ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ ఒడియాలో ట్వీట్ చేశారు. '41 సంవత్సరాల తరువాత, భారత పురుషుల హాకీ జట్టు సెమీ ఫైనల్‌కు చేరుకుంది మరియు మహిళల జట్టు చరిత్రలో మొదటిసారి సెమీ ఫైనల్‌కు చేరుకుంది. ఇది దేశానికి గర్వకారణం. 2018 నుండి, ఒడిశా రెండు జాతీయ జట్లను ప్రోత్సహిస్తోంది, ఒడిషా వాసులుగా మేమంతా గర్వపడుతున్నాం. అందరికీ నా హృదయాంతరం నుండి శుభాకాంక్షలు. జై హింద్! ' అని ట్వీట్ చేశారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+