షాక్: టెక్కీల ఉద్యోగాలకు ఎసరు, ట్రంప్ నిర్ణయమే కారణమా?

Posted By:
Subscribe to Oneindia Telugu

న్యూఢిల్లీ:అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకువచ్చిన' హైర్ అమెరికన్, బై అమెరికన్' ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ దేశీయ ఐటి కంపెనీలపై తీవ్రంగా పడనుంది.ఐటి కంపెనీల్లో పనిచేసే ఉద్యోగులపై వేటు పడే అవకాశాలు లేకపోలేదు. ఈ నిర్ణయం టెక్కీలకు తీవ్ర నిరాశే కల్గించే అవకాశం ఉందని అసోచామ్ నివేదిక వెల్లడించింది.

అమెరికా అధ్యక్షుడుగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకొన్న తర్వాత అనేక వివాదాస్పద నిర్ణయాలు తీసుకొన్నారు.ట్రంప్ నిర్ణయాలు ప్రధానంగా సాఫ్ట్ వేర్ కంపెనీలపై ప్రభావం చూపుతున్నాయి.

ఎన్నికల సమయంలో ప్రధాన ప్రచార అస్త్రంగా స్థానికులకే ఉద్యోగావకాశాలను కల్పించనున్నట్టు ట్రంప్ ప్రకటించారు.ఈ మేరకు ఈ దిశగా నిర్ణయాలను తీసుకొన్నారు.

అయితే ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నెరవేర్చుకొనేందుకుగాను ట్రంప్ చర్యలు తీసుకొన్నారు.ఈ మేరకు బై అమెరికన్,హైర్ అమెరికన్ అనే ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ను బుదవారం నాడు ట్రంప్ తెచ్చారు. ఈ నిర్ణయం ప్రభావం దేశీయ ఐటీ కంపెనీలపై పడే అవకాశం ఉంది.

అన్నంత పనిచేసిన ట్రంప్

అన్నంత పనిచేసిన ట్రంప్

ఎన్నికల ప్రచార సమయంలో స్థానికులకే ఉద్యోగావకాశాలను కల్పిస్తామని ట్రంప్ ప్రకటించారు.ఈ హమీని అమల్లోకి తెచ్చారు ట్రంప్.హైర్ అమెరికన్, బై అమెరికన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ దేశీయ టెక్ కంపెనీలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం లేకపోలేదని అసోచామ్ అభిప్రాయపడుతోంది.ఈ మేరకు టెక్కీలు ఉద్యోగాలు కోల్పోయే అవకాశాలున్నాయని అసోచామ్ అభిప్రాయపడుతోంది. ఈ నిర్ణయం టెక్కీలపై తీవ్రంగా చూపే అవకాశం ఉంది.

అమెరికా నుండి వచ్చే రెమిటెన్స్ భారీగా తగ్గనున్నాయి

అమెరికా నుండి వచ్చే రెమిటెన్స్ భారీగా తగ్గనున్నాయి

ట్రంప్ తీసుకొన్న నిర్ణయం కారణంగా అమెరికా నుండి వచ్చే రెమిటెన్స్ కూడ భారీగా తగ్గే అవకాశాలున్నాయి. ఈ మేరకు అసోచామ్ నివేదిక వెల్లడిస్తోంది. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ను దెబ్బతీయనుంది. వరల్డ్ బ్యాంక్ డేటా ప్రకారం రెమిటెన్స్ లో అమెరికా భారత్ కు రెండో అతిపెద్ద దేశంగా ఉంది. దాని తర్వాత సౌదీ అరేబియా నుండి ఎక్కువ రెమిటెన్స్ లు వస్తున్నాయి.

వర్క్ ఫోర్స్ ను తగ్గించనున్న ఐటీ కంపెనీలు

వర్క్ ఫోర్స్ ను తగ్గించనున్న ఐటీ కంపెనీలు

అమెరికా తీసుకొన్న నిర్ణయం ఆధారంగా ఐటీ సంస్థలు తమ వర్క్ ఫోర్స్ ను బలవంతంగా వేర్వేరు ప్రాంతాలకు తరలించనున్నారు. కంపెనీలు తమ ఖర్చులను భారీగా తగ్గించుకోనున్నాయి.రూపాయి విలువ పెరగడం కంపెనీలకు తక్కువ గుర్తింపు తెచ్చిపెడుతోందని అసోచామ్ సెక్రటరీ జనరల్ డీఎస్ రావత్ తెలిపారు. ఇది ఉద్యోగాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

టెక్కీల ఉద్యోగాలకు ముప్పు

టెక్కీల ఉద్యోగాలకు ముప్పు

అమెరికా తీసుకొన్న నిర్ణయం కారణంగా టెక్కీల ఉద్యోగాలను కోల్పోయే అవకాశం లేకపోలేదు. ఉద్యోగాలపై ప్రభావం చూపుతోందని అసోచామ్ నివేదిక వెల్లడించింది. హెచ్ 1 బీ వీసాల్లో కఠినతరమైన నిబంధనలు భారత్ లో ఐటీ దిగ్గజాల నియామకాల్లో, వేతనాల్లో, ఉద్యోగాల్లో కూడ మార్పులు తేనుందని అసోచామ్ నివేదిక వెల్లడించింది. అమెరికా తీసుకొన్న నిర్ణయం కారణంగా ఇక అమెరికాకు ఎవరుపడితే వాళ్ళు వెళ్ళడానికి వీల్లేదు. ఖర్చలను తగ్గించుకోవడానికి ఉద్యోగులపై వేటు పడే అవకాశం ఉందని అసోచామ్ వెల్లడించింది. పెరుగుతున్న రూపాయి కూడ ఎక్స్ పోర్ట్ టెక్నాలజీ సంస్థల మధ్య పరిస్థితి మరింత అతలాకుతం చేస్తోంది.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
With the Us tightening the norms for H1-b visas under the president Donald Trump's Buy Ameican, Hire American' campaign, the indian IT companies are bound to face disruptions by way of higher costs and even some laying off work force back home, and the rising rupee is aggravating the situation further for the technology export firms, an Assocha paper said on Wednesday.
Please Wait while comments are loading...