ఇప్పుడు ఆస్ట్రేలియాలో..: భారతీయుడిని రక్తం వచ్చేలా కొట్టారు

Subscribe to Oneindia Telugu

సిడ్నీ: ఇటీవల కాలంలో డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి రావడంతో అమెరికాలో జాతి విద్వేషదాడులు ఎక్కువయ్యాయి. భారతీయులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. తాజాగా, ఆస్ట్రేలియాలో ఓ భారతీయుడిపై జాతి విద్వేష దాడి జరిగింది. ఆస్ట్రేలియాలో కొందరు దుండగులు ప్రవాస భారతీయుడిని జాతి వివక్షతో దూషించి, రక్తం వచ్చేలా దాడి చేశారు. హోబర్ట్‌లోని ఓ రెస్టారెంట్‌లో ఈ జాతి విద్వేష చర్య జరిగింది.

గొడవ వద్దన్నందుకే..

గొడవ వద్దన్నందుకే..

కేరళలోని కొట్టాయం జిల్లా పుత్తుప్పల్లికి చెందిన లీ మ్యాక్స్ జాయ్ అనే యువకుడు నర్సింగ్ కోర్సు చేస్తూ ట్యాక్సీ డ్రైవర్‌గా పార్ట్‌ టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. అతను మెక్ డొనాల్డ్ రెస్టారెంట్‌కు కాఫీ తాగేందుకు వెళ్లాడు. అప్పటికే రెస్టారెంట్‌లో ఉన్న ఓ మహిళ సహా ఐదుగురు అక్కడి సిబ్బందితో గొడవ పడుతున్నారు. గొడవ పడొద్దని మ్యాక్స్ జాయ్ వారికి సూచించాడు.

బ్డడీ బ్లాక్ ఇండియన్స్ అంటూ దాడి

బ్డడీ బ్లాక్ ఇండియన్స్ అంటూ దాడి

తీవ్ర ఆవేశానికి లోనైన మహిళ సహా ఐదుగురు వ్యక్తులు మ్యాక్స్ జాయ్‌తో గొడవకు దిగారు.
'బ్లడీ బ్లాక్ ఇండియన్స్' అంటూ అతడిపై నోరు పారేసుకున్నారు. రెస్టారెంట్లో ఉన్న మరికొందరు పోలీసులకు ఫోన్ చేసి విషయం చెప్పారు. పోలీసులు అక్కడికి చేరుకునేలోపే దుండగులు మ్యాక్స్‌ను తీవ్రంగా గాయపరిచి పారిపోయారు.

విద్వేష దాడులు

విద్వేష దాడులు

వెంటనే జాయ్‌ను రాయల్ హోబర్ట్ హాస్పిటల్‌కు తరలించి అతడికి చికిత్స అందించారు. కారు పార్కింగ్‌లో తొలుత గొడవపడ్డారని, ఆపై రెస్టారెంట్లో ఆ కోపాన్ని తనపై ప్రదర్శించారని బాధితుడు మ్యాక్స్ తెలిపాడు. ఆస్ట్రేలియాలో జాతి విద్వేష దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని, ఈ విషయంలో విదేశాంగ మంత్రి జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశాడు.

న్యాయం చేయాలి..

న్యాయం చేయాలి..

తనకు న్యాయం చేసేందుకు పోలీసులుగానీ, అధికారలు గానీ ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదని మాక్స్ జాయ్ ఆరోపించాడు. కాగా, కొట్టాయం ఎంపీ జోస్ కె మణి ఈ జాతి విద్వేష దాడిని తీవ్రంగా ఖండించారు. విదేశాంగ మంత్రిని కలుసుకుని సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లనున్నట్లు చెప్పారు. కాగా, జాయ్‌కు భార్య, కుమారుడు ఉన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Within the span of a week, another Indian was subjected to a racial attack in Australia, raising serious concerns regarding the safety of lakhs of Indians residing there. 33 year old Li Max Joy, a Malayali taxi driver, was assaulted by a group of Australians in the early hours on Saturday.
Please Wait while comments are loading...