భారత మార్కెట్లకు ఢోకాలేదు, బ్యాంకింగ్ పటిష్టం: అదానీ షేర్ల పతనంపై నిర్మలా సీతారామన్

అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల పతనంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ, ఎస్బీఐకి భారీ ఎత్తున పెట్టుబడులు ఉన్నాయని, నష్టాలకు బాధ్యులెవరంటూ వస్తున్న ఆరోపణలపైనా స్పందించారు.

న్యూఢిల్లీ: అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల పతనంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అదానీ కంపెనీల్లో ఎల్ఐసీ, ఎస్బీఐకి భారీ ఎత్తున పెట్టుబడులు ఉన్నాయని, నష్టాలకు బాధ్యులెవరంటూ వస్తున్న ఆరోపణలపైనా స్పందించారు. మార్కెట్లు చాలా బాగా క్రమబద్ధంగా నడుస్తున్నాయని అన్నారు. ఓ జాతీయ మీడియా ఛానల్‌కు శుక్రవారం ఇచ్చిన ఇంటర్య్యూలో ఈ మేరకు స్పందించారు.

తమ మొత్తం పెట్టుబడుల్లో అదానీ కంపెనీల్లో ఉన్నవి చాలా తక్కువేనని ఎల్ఐసీ, ఎస్బీఐ చేసిన వ్యాఖ్యాల్ని నిర్మలా సీతారామన్ ప్రస్తావించారు. తమ పెట్టుబడులు అదానీ కంపెనీల్లో అనుమతించిన పరిధిలోనే ఉన్నాయని చెప్పిన అంశాన్ని గుర్తు చేశారు. కాగా, అదానీ షేర్ల పతనం వ్యవహారంపై ప్రభుత్వం తరపున తొలి అధికారిక స్పందన ఇదే కావడం గమనార్హం.

Indian markets very well regulated: Nirmala Sitharaman on Adani gruop stock crash.

దేశ బ్యాంకింగ్ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉందని నిర్మలా సీతారామన్ స్పస్టం చేశారు. ఇటీవల ఫైనాన్షియల్ స్టెబిలిటీ బోర్డు, ఆర్బీఐతో నిర్వహించిన సమీక్ష తర్వాత తాను ఈ విషయాన్ని చాలా బాధ్యతయుతంగా చెప్పగలుగుతున్నామన్నారు. బ్యాంకుల నిరర్ధక ఆస్తులు తగ్గుతున్నాయని తెలిపారు. పరోక్షంగా అదానీ షేర్ల పతనం బ్యాంకింగ్ రంగంపై ఉండబోదని నిర్మలా సీతారామన్ తేల్చి చెప్పారు.

గతంలో మాదిరిగానే విదేశీ మదుపర్లు భారత్‌లో నిశ్చితంగా పెట్టుబడులు కొనసాగించవచ్చని సీతారామన్ తెలిపారు. నియంత్రణ, నిబంధనల విషయంలో విదేశీ ఫైనాన్షియల్ మార్కెట్ చాలా బలంగా ఉందని పేర్కొన్నారు. ఒక్క ఉదంతాన్ని(అదానీ షేర్ల పతనం) ఆధారంగా చేసుకుని భారత మార్కెట్లను అంచనా వేయడం సరికాదన్నారు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్.

దశాబ్దాలుగా అనేక అంశాలపై భారత మార్కెట్లు పాఠాలు నేర్చుకున్నాయన్నారు. దేశీయ మార్కెట్లను పటిష్టంగా ఉంచడంలో రెగ్యూలేటింగ్ సంస్థలు ఖచ్ఛితత్వంతో పనిచేస్తున్నాయని వివరించారు.
మునుపటి పెట్టుబడిదారుల విశ్వాసం ఇప్పుడు కూడా కొనసాగుతుందని తాను భావిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+