జీవితంలో ఒక్కసారన్నా ఈ రైల్వేస్టేషన్లకు కచ్చితంగా వెళ్లిరండి

భారతీయ రైల్వే గురించి ప్రత్యేక పరిచయం అవసరంలేదు. ఎందుకంటే ప్రతిరోజు తనను తాను మెరుగుపరుచుకుంటూ, అత్యాధునిక సాంకేతికతను అందిపుచ్చుకుంటూ, ప్రయాణికులకు అద్భుతమైన సౌకర్యాలను కల్పిస్తూ ముందుకు దూసుకుపోతోంది. నెట్ వర్క్ పరంగా ప్రపంచంలోనే నాలుగో స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా దాదాపు 13,600 రైళ్లద్వారా ప్రతిరోజు రెండుకోట్ల మంది ప్రయాణికులను తమ గమ్యస్థానాలకు భారతీయ రైల్వే చేరవేస్తోంది. సరకు రవాణాద్వారా అత్యధిక ఆదాయం వస్తున్నప్పటికీ ప్రయాణికులద్వారా కూడా భారీ ఆదాయాన్ని కూడగట్టుకుంటోంది.

మన భారతీయ రైల్వే ఇంజనీరింగ్ నైపుణ్యానికి నిదర్శనంగా ఎన్నో అందమైన, అద్భుతమైన రైల్వేస్టేషన్లను దేశంలో రూపుదిద్దుకున్నారు. వాటి అందాలను వీక్షించాలన్నా, పరిసరాలను చూసి అచ్చెరువొందాలన్నా జీవితంలో తప్పనిసరిగా ఆయా స్టేషన్లకు వెళ్లిరావాలి.

indian most beautiful railway stations detail here

ఛత్రపతి శివాజీ టెర్మినల్
యునెస్కో వారసత్వ కట్టడాల్లో ఇది కూడా ఒకటి. 1887లో దీన్ని నిర్మించారు. ముంబయి నగరంలోని అతి ప్రధానమైన ఈ రైల్వేస్టేషన్ నిత్యం ఎంతో రద్దీగా ఉంటుంది. పురాతన వారసత్వ కట్టడమైన ఈ స్టేషన్ ను తప్పనిసరిగా వీక్షించాల్సిందే.

దూద్ సాగర్ రైల్వేస్టేషన్
గోవాకు దగ్గరలో ఉన్న అందమైన జలపాతం దూద్. దీన్ని చూస్తూ మైమరిచిపోవచ్చు. తెల్లటి నురగలాంటి నీరు పైనుంచి కిందకు దుముకుంటే మనసు ఆనందంతో పరవళ్లు తొక్కుతుంది. ఇక్కడి రైల్వేస్టేషన్ వ్యూ ఎంతో అద్భుతంగా ఉంటుంది. చుట్టుపక్కలి ప్రకృతి అందాలను చూస్తూ మిమ్మల్ని మీరు మైమరచిపోతారు. కచ్చితంగా చూసిరండి.

కొజికోడ్ రైల్వేస్టేషన్
కేరళ సాంప్రదాయాలను ప్రతిబింబించేలా దీన్ని రూపొందించారు. అందమైన ఆర్కిటెక్చర్ తో రూపుదిద్దుకుంది.

గమ్ రైల్వేస్టేషన్
పశ్చిమ బెంగాల్ లో ఉంటుంది. ప్రపంచంలోనే అత్యంత అందమైన రైల్వేస్టేషన్ గా ఇది పేరు తెచ్చుకుంది. అతి చిన్న రైల్వేస్టేషన్ ఇది. చుట్టుపక్కల పరిసరాల గురించి ప్రత్యేకంగా చెప్పడంకన్నా వాటిని చూస్తేనే మంచిది.

చిత్తోర్ గఢ్ రైల్వేస్టేషన్
ఈ రైల్వేస్టేషన్ లో అనేక ప్లాట్ ఫామ్స్ ఉంటాయి. ఈ స్టేషన్ లో ఉండే వెయిటింగ్ రూమ్స్, ఫుడ్ స్టాల్స్, రెస్ట్ రూమ్స్.. ఇలా అన్నీ పాతకాలాన్ని ప్రతిబింబించేలా ఉంటాయి. ఇక్కడకు వెళితే మనం ఎప్పుడో వెనకటి కాలానికి వెళ్లినట్లుగా ఉంటుంది.

మడ్గౌన్ రైల్వేస్టేషన్
పోర్చుగీసు, ఇండియన్ ఆర్కిటెక్కర్ కలిపి దీన్ని నిర్మించారు. గోవా వెళ్లేవారంతా ఈ స్టేషన్ నుంచి వెళుతుంటారు. ఎంతో అందమైన రైల్వేస్టేషన్.

రాణీ కమలాపతి రైల్వేస్టేషన్
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఉంటుంది. ఈ స్టేషన్ లో అంతా పై కప్పు ఉంటుంది. స్టేషన్ లో ఇలా ఉండటం అనేది చాలా అరుదుగా, ప్రత్యేకంగా అనిపిస్తుంటుంది.

కార్వార్ రైల్వేస్టేషన్
కర్ణాటకలో ఉంటుంది. చుట్టుపక్కల పరిసరాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అరేబియా సముద్రం, పశ్చిమ కనుమలు మధ్యలో ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+