వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హిందుస్థాన్ హిందువులదే: గవర్నర్ సంచలన వ్యాఖ్య

By Srinivas
|
Google Oneindia TeluguNews

డిస్పూర్: హిందుస్తాన్ హిందువులదేనని అసోం గవర్నర్ పిబి ఆచార్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం నాడు జరిగిన ఓ పుస్తకావిష్కరణ సభలో ఆయన మాట్లాడారు. భారత్‌లోని ముస్లీంలు తమకు నచ్చితే పాకిస్తాన్, బంగ్లాదేశ్ వెళ్లవచ్చునని చెప్పారు.

దీనిపై దుమారం రేగింది. దీంతో ఆయన తన వ్యాఖ్యల పైన వివరణ ఇచ్చారు. భారత్ నిస్సందేహంగా హిందువులదే అన్నారు. ఇతర దేశాల్లోని హిందువులు ఇక్కడకు రావొచ్చని, వాళ్లే కాదు... ముస్లీంలతో పాటు భారతీయ మూలాలు ఉన్న ఇతర మతస్తులు ఎవరైనా వేరే దేశాల్లో హింసకు గురైతే భారత్ రావొచ్చన్నారు.

అదేవిధంగా భారతీయ ముస్లీంలు ఎవరైనా తమకు నచ్చితే పాకిస్తాన్, బంగాల్దేశ్ సహా ఎక్కడకు అయినా వెళ్లవచ్చునని చెప్పారు. బంగ్లాదేశ్‌లో హింసకు గురైన తస్లీమా నస్రీన్ ఇక్కడకు వచ్చిందని గుర్తు చేశారు. ఆయన వ్యాఖ్యల పైన కాంగ్రెస్ పార్టీ మండిపడిది. ఆయనని తొలగించాలని డిమాండ్ చేసింది.

 Indian Muslims free to go anywhere, says Assam governor

పిబి ఆచార్య వివాదాస్పద వ్యాఖ్యలతో ఆ పదవికి మచ్చ తెచ్చారని, ఆయనను వెంటనే తొలగించి ఉన్నత భావాలు గల మరో వ్యక్తిని నియమించాలని అసోం గవర్నర్ తరుణ్ గొగోయ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడటం సరికాదని కాంగ్రెస్ నేత అభిషేక్ సింఘ్వీ అన్నారు.

అసోం బిజెపి చీఫ్‌గా సోనోవాల్

వచ్చే ఏడాది జరిగే అసోం అసెంబ్లీ ఎన్నికలకు బిజెపి జాగ్రత్త పడుతోంది. కేంద్రమంత్రి సోనోవాల్‌ను అసోం బిజెపి శాఖ అధ్యక్షుడిగా నియమించింది. ఎన్నికల కమిటీ సారథ్య బాధ్యతలను ఆయనకే అప్పగించింది.

తద్వారా రాష్ట్రంలో తమ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి ఆయనే అని సంకేతాలు ఇచ్చింది. పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి బిజెపిలో చేరిన సీనియర్ నేత హిమనాథ బిశ్వాస్ శర్మను పార్టీ ఎన్నికల కమిటీ కన్వీనర్‌గా నియమించింది.

English summary
Assam governor PB Acharya was found entangled on Sunday in the raging intolerance row for allegedly saying “Hindustan is for Hindus” and “Muslims in India are free to go anywhere”, remarks that he said were misinterpreted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X