అమెరికాలో భారతీయ విద్యార్థి అనుమానాస్పద మృతి

Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్: అమెరికాలో మరో భారతీయ విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే.. కార్నెల్ ఇంజినీరింగ్ కాలేజీలో సీనియర్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చదువుతున్న ఆలాప్ నరసిపురా మే 17 నుంచి కనిపించకుండా పోయాడు.

కాగా, పాల్ క్రీక్ ప్రాంతంలో ఓ మృతదేహం ఉందని సమాచారం అందుకున్న పోలీసులు వెళ్లి పరిశీలించారు. అది నరసిపురాదేనని గుర్తించారు. అయితే నరసిపురా మృతిపై ఇప్పటివరకూ ఎలాంటి అనుమానాలు లేవని చెప్పారు.

Indian-origin Cornell University student found dead in US

ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. నరసిపురా చురుకైన విద్యార్థి అని, అతడు, తాను రోజూ ఫొటోలు దిగేవాళ్లమని క్యాంపస్ లైఫ్ విద్యార్థి వైస్ ప్రెసిడెంట్ ర్యాన్ లంబార్డి తెలిపారు. నరసిపురా ఇక్కడే తన మాస్టర్ డిగ్రీ చేయాలని కూడా ప్రణాళికలు వేసుకున్నాడని, అంతలోనే ఇలా జరగడం బాధాకరమని అన్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A 20-year-old Indian-origin ornell University student was found dead here after going missing this week.
Please Wait while comments are loading...