భర్త పాస్‌పోర్ట్‌తో ఇండియాకు: విచారణకు ఆదేశం

న్యూఢిల్లీ: ఒకరి పాస్‌పోర్ట్‌కు బదులుగా మరోకరి పాస్‌పోర్ట్‌తో బ్రిటన్ నుండి ఇండియాకు చేరుకొంది ఓ మహిళ అయితే ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నారని తేటతెల్లమైంది.న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్ అధికారులు తనిఖీలు నిర్వహించిన సమయంలో అసలు విషయం వెలుగు చూసింది.

భారత సంతతికి చెందిన గీత మోధ అనే మహిళ మాంఛెస్టర్‌లో అలంకార్ వస్త్ర దుకాణాన్ని నడుపుతోంది. గత ఏప్రిల్ 23వ తేదిన వ్యాపార పనుల నిమిత్తం ఆమె ఢిల్లీకి రావాల్సి వచ్చింది. దీంతో ఆమె తన పాస్‌పోర్ట్‌కు బదులుగా తన భర్త పాస్‌పోర్ట్ తీసుకొని ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్‌లో బయలు దేరింది.

దుబాయ్ నుండి ఢిల్లీకి చేరుకొంది. ఇమ్మిగ్రేషన్ పూర్తైతేనే భారత్‌లోకి అనుమతి ఉంటుంది. అయితే ఎయిర్‌పోర్టుల్లో నామమాత్రంగా తనిఖీలు నిర్వహించడం వల్ల గీత న్యూఢిల్లీకి చేరుకొంది.

Indian-Origin Woman Flew From Britain To India On Husbands Passport

అయితే న్యూఢిల్లీలోని ఎయిర్‌పోర్ట్‌లో అధికారులు గీత ఇమ్మిగ్రేషన్ తనిఖీ చేయడంతో అసలు విషయం వెలుగు చూసింది. తన పాస్‌పోర్ట్‌కు బదులుగా భర్త పాస్‌పోర్ట్ తీసుకొచ్చినట్టు ఆమె గుర్తించింది.

ఎయిర్‌పోర్ట్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై గీత మండిపడింది. అధికారులు నామ మాత్రంగా తనిఖీలు నిర్వహిస్తున్నారని ఆమె అభిప్రాయపడింది. అయితే ఈ విషయమై విచారణ చేస్తున్నట్టుగా ఎయిర్‌లైన్స్ వర్గాలు ప్రకటించాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+