రైళ్లల్లో కొత్త నిబంధనలు: మరింత వెసలుబాటు

న్యూఢిల్లీ: ప్రయాణికులకు మరింత సౌకర్యాలను కల్పించే విధంగా రైల్వేలో ప్రస్తుతం అమలులో ఉన్న పలు నిబంధనల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. జులై 1వ తేదీ నుంచి కొత్త మార్గదర్శకాలు, నిబంధనలను ప్రవేశపెట్టడానికి రైల్వే మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. దీనిపై ప్రయణికుల్లో అవగాహన కల్పించడానికి ఇప్పటి నుంచే చర్యలు తీసుకుంటోంది. మార్పులు చోటు చేసుకోనున్న నిబంధనల గురించి తెలియజేయడానికి ప్రత్యేక చర్యలను తీసుకుంటోంది.

వెయిటింగ్ లిస్ట్ ఇబ్బందులు తొలగిపోనున్నాయి. సువిధ రైళ్లల్లో ప్రయాణికులకు కన్ఫర్మ్ టిక్కెట్ల సౌకర్యం లభించనుంది. తత్కాల్ టిక్కెట్లను రద్దు చేసుకున్న ప్రయాణికులకు 50 శాతం మొత్తాన్ని రైల్వే అధికారులు తిరిగి చెల్లిస్తారు. తత్కాల్ టిక్కెట్ల నిబంధనల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకోనున్నాయి. ఏసీ కోచ్ లో బెర్త్ కోసం ప్రయాణికులు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు తమ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. స్లీపర్ కోచ్ కోసం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు బుకింగ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.

Train

రాజధాని, శతాబ్ది ఎక్స్‌ప్రెస్ లల్లో పేపర్‌లెస్ టికెటింగ్ సౌకర్యాన్ని ప్రారంభించబోతోన్నారు రైల్వే అధికారులు. ఇది కూడా జులై 1 నుంచి అమలులోకి రానుంది. ఇది అందుబాటులోకి వచ్చిన తరువాత శతాబ్ది, రాజధాని ఎక్స్‌ప్రెస్‌లల్లో ప్రింటెడ్ టిక్కెట్లు అందుబాటులో ఉండవు. వాటి స్థానంలో టిక్కెట్ వివరాలను ప్రయాణికుల రిజిస్టర్డ్ మొబైల్‌ ఫోన్ కు అందుతుంది.

త్వరలో వివిధ భాషల్లో రైల్వే టికెటింగ్ సౌకర్యం మొదలు కానుంది. ఇప్పటివరకు రైల్వేలో హిందీ, ఇంగ్లిష్‌లల్లోనే టిక్కెట్లు అందుబాటులో ఉంటూ వస్తోన్నాయి. ఇప్పుడు వేర్వేరు ప్రాంతీయ భాషల్లో టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. రద్దీ సమయాల్లో మెరుగైన ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడానికి రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ సర్దుబాటు వ్యవస్థను ప్రవేశపెట్టనున్నారు. రైల్వే మంత్రిత్వ శాఖ జూలై 1వ తేదీ నుంచి రాజధాని, శతాబ్ది, దురంతో, మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల తరహాలో సువిధ రైళ్లను విస్తృతస్థాయిలో నడపనుంది.

Trains

సువిధ రైళ్లలో టిక్కెట్ల రద్దుపై 50 శాతం మేర ఛార్జీని తిరిగి చెల్లిస్తారు అధికారులు. ఇది కాకుండా, ఏసీ-2 టయర్‌పై 100 రూపాయలు, ఏసీ-3 టయర్‌పై 90 రూపాయలు, స్లీపర్‌ పై ఒక్కో ప్రయాణికుడికి 60 రూపాయల చొప్పున ఛార్జీ మొత్తాన్ని తగ్గించనున్నారు. రాత్రి వేళ తమ గమ్యస్థానానికి రైలు చేరుకోగానే ప్రయాణికులకు మెలకువ వచ్చేలా ప్రత్యేక వ్యవస్థను అందుబాటులోకి తీసుకొచ్చింది రైల్వే శాఖ. 139కు కాల్ చేయడం ద్వారా వేకప్ కాల్ డెస్టినేషన్ అలర్ట్ సదుపాయాన్ని ప్రవేశపెట్టింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+