ట్రైన్ లో మహిళలు టికెట్ లేకుండా ప్రయాణించొచ్చు?
భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం అనేక సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది. సీనియర్ సిటిజన్ల నుంచి మహిళల వరకు ప్రత్యేక సౌకర్యాలను కల్పిస్తోంది. మహిళలు రైలులో టిక్కెట్ లేకుండా ప్రయాణించవచ్చనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.
కరోనాకు ముందు సీనియర్ సిటిజన్లకు ఛార్జీలో రాయితీ ఉండేది. నిబంధనల ప్రకారం రైలులో ప్రయాణించే మహిళకు టికెట్ లేకపోతే ఆమెను వెంటనే రైలు నుంచి దింపకూడదు. ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు ఎలా వ్యవహరించాలనే విషయంలో స్నేహపూర్వక నియమాలను రూపొందించారు. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం, టికెట్ లేకుండా రాత్రిపూట రైలులో ఒక మహిళ లేదా బిడ్డ ఒంటరిగా ప్రయాణిస్తుంటే, TTE ఆమెను రైలు నుంచి దించకూడదు.

ఇలా చేస్తే సంబంధిత మహిళ రైల్వే అథారిటీకి టీటీపై ఫిర్యాదు చేయవచ్చు. ప్రయాణికులకు అనుకూలమైన మరొక నియమం ఏమిటంటే, టిక్కెట్‌ని తనిఖీ చేయడానికి రాత్రి ప్రయాణ సమయంలో ప్రయాణికులను నిద్రలేపడం ద్వారా టిక్కెట్‌ను చూపించమని TTE డిమాండ్ చేయకూడదు. నిబంధనల ప్రకారం ప్రయాణికులు రాత్రి 10:00 గంటల నుంచి ఉదయం 6:00 గంటల వరకు ప్రశాంతంగా నిద్రించవచ్చు. ఆ సమయంలో టీటీఈ నిద్ర లేపకూడదు. అయితే రాత్రివేళ రైలు ఎక్కిన ప్రయాణికులకు ఈ నిబంధన వర్తించదు
సీనియర్ సిటిజన్లకు టికెట్లలో 50 శాతం రాయితీ ఇస్తుండగా కరోనా సమయంలో వాటిని రద్దుచేశారు. ఇప్పటివరకు వాటిని పునరుద్ధరించలేదు. రాయితీలు ఎత్తేయడంవల్ల రైల్వేకు రూ.2వేల కోట్ల లాభం కలిగిందని రైల్వే మంత్రి లోక్ సభలో తెలిపారు. అయితే రైల్వే అనేది వ్యాపార సంస్థ కాదని, ప్రజల కోసం నడుపుతున్న సంస్థ అని, సీనియర్ సిటిజన్స్ రాయితీని ఇవ్వాలంటూ కొన్నివర్గాల నుంచి డిమాండ్ వస్తోంది.












Click it and Unblock the Notifications