Vande Bharat : వందే భారత్ ప్రయాణికులకు మరో గుడ్ న్యూస్-మీ కోసమే ఈ మార్పులు...!
ప్రయాణికులకు ఆహ్లాదకరమైన ప్రయాణాన్ని అందించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా పదుల సంఖ్యలో వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తెచ్చిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు వాటిలో ప్రయాణ అనుభవాన్ని మరింత మెరుగుపర్చేందుకు పలు మార్పులు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రయాణికుల కోసం తాము చేపట్టిన మార్పుల్ని ఇవాళ రైల్వే ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. ప్రయాణికుల ఫీడ్ బ్యాక్ ఆధారంగా కాలానుగుణంగా చేపడుతున్న మార్పుల్లో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది.
వందే భారత్ రైళ్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించే క్రమంలో తాజాగా తాము చేపట్టిన 25 మార్పుల్ని వివరిస్తూ రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఇందులో ప్రయాణీకులకు మరింత సౌకర్యంగా ఉండేలా సీట్ల వాలు కోణం 17.31 నుండి 19.37 డీగ్రీలకు పెంచినట్లు రైల్వే తెలిపింది. అలాగే సీట్ల కుషన్ మెత్తదనం 290N నుండి 250N వరకు అంటే 25 శాతం తగ్గించామని వెల్లడించింది. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ (ఈ.సీ.సీ)లో సీటు రంగు ఎరుపు నుండి ఆహ్లాదకరమైన నీలం రంగులోకి మార్చింది. సీట్ల క్రింది భాగంలో మొబైల్ ఛార్జింగ్ పాయింట్లను మరింతగా అందుబాటులో తెచ్చింది.

ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ లో సీట్ల ఫుట్ రెస్ట్ మరింత సౌకర్యవంతంగా మెరుగుపర్చినట్లు రైల్వే వెల్లడించింది. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ తరగతి చివరి సీట్ల కోసం మ్యాగజైన్ బ్యాగ్‌లను అందిస్తున్నట్లు తెలిపింది. మరుగుదొడ్లలో ఉన్న వాష్ బేసిన్లో నీరు బయటకి చిమ్మకుండా ఉండటానికి వాష్ బేసిన్ లోతు పెంచింది. టాయిలెట్లలో మెరుగైన లైటింగ్ కొరకు 1.5 వాట్‌ల నుండి 2.5 వాట్‌ల ఏర్పాటు చేసింది. మెరుగైన పట్టు కోసం అదనపు మెలుపు కలిగిన టాయిలెట్ హ్యాండిల్ ఏర్పాటు చేసింది. అలాగే మెరుగైన నీటి ప్రవాహ నియంత్రణ కోసం నీటి కుళాయిలకు ఏరేటర్ ఏర్పాటు చేసింది.
టాయిలెట్ ప్యానెల్స్ ఒకేలా కనిపించేందుకు రంగుల్ని ప్రామాణీకరించినట్లు రైల్వే తెలిపింది. దివ్యాంగ ట్రైలర్ కోచ్‌లలో దివ్యాంగ ప్రయాణీకులకు దివ్యాంగజన్ సీటు సదుపాయంతో పాటు వీల్ చైర్‌ల కోసం సెక్యూరింగ్ పాయింట్ ఏర్పాటు చేసింది.
మెరుగైన సౌందర్యం, కోచ్‌లలో ప్యానెల్‌ల పటిష్టత కోసం మెరుగైన ట్రిమ్ ప్యానెల్ ఏర్పాటు చేసింది. అత్యవసర పరిస్థితుల్లో సులభoగా అందేలా సుత్తి కలిగిన మెరుగైన కవర్ బాక్స్ ఉంచింది. ప్యానెల్ బ్యాక్‌గ్రౌండ్‌తో సరిపోయేలా బోర్డర్‌లెస్ ఎమర్జెన్సీ టాక్ బ్యాక్ యూనిట్ (అత్యవసర సమయంలో డ్రైవర్‌తో స్పందించడానికి ) ఏర్పాటు చేసింది.
అత్యవసర పరిస్థితుల్లో కోచ్ అంతా పారదర్శకంగా కనిపించేందుకు వీలుగా కోచ్‌లలోని అగ్నిమాపక యంత్రాల కోసం హింగ్డ్ పారదర్శక డోర్ అసెంబ్లీ చేసింది. కోచ్‌ల లోపల సౌందర్యాన్ని మెరుగుపరచడానికి ఎఫ్.ఆర్.పి ప్యానెల్‌ల సింగిల్ పీస్ నిర్మాణంలో సరిచేసిన ప్యానెల్‌లు ఏర్పాటు చేసింది. మెరుగైన ఎయిర్ కండిషనింగ్ కోసం ప్యానెల్‌లపై ఇన్సులేషన్ బిగించింది.
తక్కువ పారదర్శకతతో ఎక్కువ బరువును మోయడానికి మెరుగైన రోలర్ బ్లైండ్ ఫాబ్రిక్ ఏర్పాటు చేసింది. ట్రైలర్ కోచ్‌లలో సులభమైన విద్యుత్ నిర్వహణ కోసం హాచ్ డోర్లు పెట్టారు. రెసిస్టివ్ టచ్ నుండి కెపాసిటివ్ టచ్‌కి మార్చడం ద్వారా లగేజ్ రాక్ లైట్ల కోసం స్మూత్ టచ్ కంట్రోల్స్ ఏర్పాటు చేశారు. లోకో పైలట్ కు అనువుగా ఉండేందుకు డ్రైవర్ కంట్రోల్ ప్యానెల్‌లో ఎమర్జెన్సీ స్టాప్ పుష్ బటన్‌ను మార్చారు. కోచ్‌ల లోపల ఏరోసోల్ ఆధారిత ఫైర్ డిటెక్షన్ మరియు సప్రెషన్ సిస్టమ్ మెరుగుపర్చారు. ల్యాండ్‌స్కేప్, ఓ ఎచ్ ఈ ఎత్తుగా ఉన్న ప్రాంతాల్లో హై రైజ్ పాంటోగ్రాఫ్‌లు ఏర్పాటు చేశామని తెలిపింది
-
భారత పారిశ్రామిక వృద్ధి రేటు తగ్గుదల.. యుద్ధం కంటే ముందే..! -
అప్పటి వరకూ పాకిస్థాన్ కు నో వాటర్: భారత్ సంచలనం -
కిర్రాక్ ఫీచర్లతో Boat Valour Watch 1R.. ధర ఎంతంటే ?? -
ఏసీ గదుల్లో ఎక్కువగా ఉంటున్నారా- అయితే, ఇది తెలుసుకోవాల్సిందే..!! -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త!












Click it and Unblock the Notifications