వీడియో: మేకిన్ ఇండియా మరి! గంటకు 180 కి. మీ వేగంతో పరుగెత్తే రైలింజన్
Recommended Video
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన తొలి హయాంలో ఆరంభించిన మేకిన్ ఇండియా ఫలితాలను ఇవ్వడం మొదలు పెట్టింది. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన రైలింజన్ పట్టాలు ఎక్కింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో పరుగెత్తడం ఆ ఇంజిన్ ప్రత్యేకత. ఈ ఇంజిన్ ను ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించారు. టెస్ట్ రన్ లో ఈ రైలు గరిష్ఠంగా 180 కిలోమీటర్ల ను అందుకుంది. రాజస్థాన్ లోని కోటా - సవాయ్ మధోపూర్ సెక్షన్ మధ్య ఈ ట్రయల్ రన్ నిర్వహించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను రైల్వే శాఖ మంత్రి పియూష్ గోయల్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
ఈ ఇంజిన్ తయారు చేయడానికి 100 కోట్ల రూపాయలను వ్యయం చేశారు. పశ్చిమ బెంగాల్ లోని చిత్తరంజన్ లోకోమోటివ్ వర్క్ షాప్ లో హైస్పీడ్ రైలు ఇంజన్లను తయారు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ దార్శనికత ఫలితంగా ఈ అద్భుతం సాధ్యపడిందని పియూష్ గోయల్ అన్నారు. మోడీ నేతృత్వంలో మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా హైస్పీడ్ రైలు ఇంజన్ల తయారీని చేపట్టినట్లు తెలిపారు. రైలు ప్రయాణ వ్యవధిని గణనీయంగా తగ్గించడమే తమ ప్రధాన లక్ష్యమని అన్నారు. ప్రయాణికులు ఇక తక్కువ సమయంలోనే గమ్యస్థానాలకు చేరుకోవచ్చని అన్నారు.

ఇదివరకు మేకిన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా రైల్వే మంత్రిత్వశాఖ ఇంజిన్ రహిత రైలును తయారు చేసిన విషయం తెలిసిందే. వందేభారత్ పేరుతో పట్టాలెక్కింది ఈ రైలు. ప్రస్తుతం ఢిల్లీ-వారణాశి మధ్య నడుస్తోంది. దీని గరిష్ఠ వేగం 120 కిలోమీటర్లు. ఇప్పటిదాకా ఇదే అత్యధిక వేగంతోొ పరుగులెత్తే రైలుగా పేరు నమోదు చేసుకుంది. తాజాగా ఈ 180 కిలోమీటర్ల వేగంతో నడిచే రైలు అందుబాటులోకి వస్తే.. దాని రికార్డు కనుమరుగౌతుంది. తాజాగా రైలింజన్ ను ప్రయాణికుల కోసం అందుబాటులోకి తీసుకుని రావడానికి మరికొంత సమయం పడుతుందని పియూష్ గోయల్ అన్నారు.
Railways has manufactured a high speed locomotive in West Bengal's Chittaranjan Locomotive Works, achieving a top speed of 180km/hr.
— Piyush Goyal (@PiyushGoyal) August 12, 2019
This new locomotive produced under 'Make In India' initiative, will speed up trains like never before.
Watch the video: pic.twitter.com/E5QCi0dSa7
-
IPL 2026: ఆర్సీబీని వీడియో గేమ్ ఆడిన బుడ్డోడు.. నోరెళ్లబెట్టిన కోహ్లీ! -
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు!












Click it and Unblock the Notifications