జమ్మూలో ఉద్రిక్తతల వేళ జమ్మూ నుండి భారతీయ రైల్వే సాహసం
భారత్ పాకిస్తాన్ యుద్ధంతో జమ్మూ కాశ్మీర్ వణికిపోతుంది. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఆందోళనకు గురిచేస్తుంది. దేశంలో ఉత్తర పశ్చిమ నగరాలను లక్ష్యంగా చేసుకొని పాకిస్థాన్ నిన్న రాత్రి డ్రోన్లు క్షిపణులతో జరిపిన దాడి ప్రయత్నాలను భారత సైనికదళాలు తిప్పికొట్టాయి. జమ్మూ, పఠాన్ కోట్, ఉదంపూర్ లో సైనిక స్థావరాలు, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి అనేక ప్రదేశాలను లక్ష్యంగా చేసుకునేందుకు పాకిస్తాన్ ప్రయత్నించిందని డిఫెన్స్ కార్యాలయం తెలియజేసింది.
జమ్మూ కాశ్మీర్ దిశగా 8 క్షిపణులు .. తిప్పికొట్టిన భారత్
భారత సైనిక దళాలు ఈ దాడిని సమర్థవంతంగా తిప్పి కొట్టడంతో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు. పాకిస్తాన్ ప్రయోగించిన 8 క్షిపణులు జమ్మూ కాశ్మీర్ దిశగా వచ్చాయని అన్ని క్షిపణులను వైమానిక రక్షణ విభాగాలు అడ్డుకొని వాటిని బ్లాక్ చేశాయని తెలుస్తోంది. Israel పై హమాస్ దాడి చేసిన పద్ధతినే పాకిస్తాన్ సైన్యం కూడా అనుసరిస్తోందని సైన్యం తెలియచేసింది.

చొరబాటు యత్నాన్ని అడ్డుకున్న భద్రతాదళాలు
నిన్న రాత్రి అంతర్జాతీయ సరిహద్దు గుండా చొరబాటు యత్నాన్ని కూడా సరిహద్దు భద్రతా దళం అడ్డుకొని ఏడుగురు ఉగ్రవాదులను హతమార్చింది. పాకిస్తాన్ లోని దందార్ స్థావరానికి కూడా సరిహద్దు భద్రత దళాలు తీవ్ర నష్టం కలిగించాయి. పాకిస్తాన్తో యుద్ధం అనేది తమ ఉద్దేశం కాదని కేవలం పాకిస్థాన్లోని ఉగ్రవాద స్థావరాల పైన దాడి జరిపామని మన దేశం పునరుద్ఘాటించింది.
జమ్మూ పై పాకిస్తాన్ దాడుల ప్లాన్.. భయంతో జనం
పెహల్గాం ఉగ్రవాద దాడి నిజానికి యుద్ధమని భారత్ కేవలం దానికి ప్రతిస్పందిస్తోందని మన దేశం మరోసారి చెప్పింది. ఇదిలా ఉంటే భారత్, పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్తాన్ జమ్మూ లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. ఈ క్రమంలో అక్కడి ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఇళ్ళనుండి బయటకు రావద్దని సూచనలు చేస్తున్నారు. అయితే జమ్మూ కాశ్మీర్లో కొనసాగుతున్న అలజడి నేపథ్యంలో అక్కడ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని భావిస్తున్నారు.
సంచలన నిర్ణయం తీసుకున్న భారతీయ రైల్వే
ఈ క్రమంలో ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. దీంతో భారతీయ రైల్వే అక్కడి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. జమ్ము, ఉదంపూర్ నుంచి ఢిల్లీకి మూడు ప్రత్యేక రైళ్ళు నడిపే ఆలోచనలో ఇండియన్ రైల్వే ఉన్నట్లు సమాచారం.
జమ్మూలో మోగుతున్న సైరన్ లు
దేశ సరిహద్దుల్లో ఏర్పడిన పరిస్థితులు, ప్రయాణికుల డిమాండ్ మేరకు భారతీయ రైల్వే నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఇక జమ్మూ జిల్లావ్యాప్తంగా సైరన్ లు మోగుతూనే ఉన్నాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని సైనికులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే సరిహద్దు రాష్ట్రాల్లోని పలు నగరాలలో బ్లాక్ అవుట్ పాటించారు.
మూడు ప్రత్యేక రైళ్ళు
ఇక తాజాగా జమ్మూ కాశ్మీర్ ప్రజలు భయపడుతున్న క్రమంలో మూడు ప్రత్యేక రైళ్ళ ద్వారా వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని భావిస్తున్నారు. అయితే యుద్ధం కొనసాగుతున్న సమయంలో ఇండియన్ రైల్వే ఈ సాహసోపేత నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరం.












Click it and Unblock the Notifications